News September 10, 2024
HYDలో భారీగా తగ్గిన చికెన్ ధరలు
హైదరాబాద్‌లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గతవారం కిలో రూ. 200లకు పైగానే విక్రయించారు. గణేశ్ నవరాత్రులు మొదలుకావడంతో మాంసం విక్రయాలు క్రమంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ కిలో రూ. 161, స్కిన్ లెస్ రూ. 183, ఫాంరేటు రూ. 89, రిటైల్ రూ. 111 చొప్పున విక్రయిస్తున్నారు.
SHARE IT
Similar News
News October 10, 2024
HYD: ఉత్తమ్ తండ్రికి నివాళులర్పించిన అగ్రనేతలు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మందకృష్ణ మాదిగ హాజరై పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు.
News October 10, 2024
HYD: ప్రజారోగ్య అడిషనల్ డైరెక్టర్‌గా కాకుమాను శశిశ్రీ
తెలంగాణ డైరెక్టరేట్ పబ్లిక్ హెల్త్ అడిషనల్ డైరెక్టర్ (అడ్మిన్)గా కాకుమాను శశిశ్రీ బాధ్యతలు చేపట్టారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమె ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. వైద్య ఆరోగ్యశాఖలో అపారమైన అనుభవం కలిగిన అధికారి రావడంతో అధికారులు, ఉద్యోగులు పట్లఉద్యోగులు వర్షం వ్యక్తం చేశారు.
News October 10, 2024
HYD: బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన RTC ఎండీ
తెలంగాణ ఆడపడుచులకి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ఆడవపడుచులు బతుకమ్మను రంగు పూలతో అలంకరించి పూజలు చేయడం ఆనందం కలిగిస్తుందన్నారు. తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని కీర్తించారు.