News March 26, 2024
HYDలో మండుతున్న ఎండలు..!
HYDలో ఎండలు మండుతున్నాయి. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీంతో ఉదయం 10 తర్వాత బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. సోమవారం సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 29.3గా నమోదైంది. అత్యధికంగా ఇబ్రహీంపట్నం, మొయినాబాద్‌లో 39.6, షేక్‌పేట్‌లో 39.2, అసిఫ్‌నగర్‌లో 38.8, సరూర్‌నగర్‌లో 38.4 డిగ్రీలుగా నమోదయ్యాయి.
Similar News
News January 10, 2025
జీహెచ్ఎంసీ గ్రౌండ్లను సిద్ధం చేయడంపై FOCUS
HYD మహానగరానికి క్రీడలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మొదటి దశలో 3 మైదానాలను నేషనల్ లెవెల్ ఫెసిలిటీస్‌తో అభివృద్ధి చేయనుంది. అంబర్‌పేట, గోల్కొండ, విజయనగర్ కాలనీలోని మైదానాలను దీనికి అధికారులు ఎంపిక చేశారు. త్వరలోనే డిజైన్లు సిద్ధం కానున్నాయి. ఎంపికైన గ్రౌండ్లలో అంబర్‌పేట మైదానం 3.153 ఎకరాలు, గోల్కొండ ఒవైసీ ప్లేగ్రౌండ్ 1.878 ఎకరాలు, విజయనగర్ కాలనీలో 1.853 ఎకరాల్లో ఉంది.
News January 10, 2025
HYD: కన్హా శాంతి వనంలో మెడిటేషన్ FREE
HYD నగర శివారులో శంషాబాద్ నుంచి చేగూరు వెళ్లే మార్గంలో దాదాపు 1600 ఎకరాల్లో విస్తరించి ఉన్న కన్హా శాంతి వనంలో మెడిటేషన్ కోసం వచ్చే వారికి ఎలాంటి రుసుము లేదన్నారు. ఒకేసారి లక్షమంది మెడిటేషన్ చేసే ఇలా ఇందులో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో ఉచిత శిక్షణ, వసతి సదుపాయం సైతం కల్పించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మెడిటేషన్ ద్వారా మానసిక ప్రశాంతతను పొందడానికి ఇదొక చక్కటి ప్రాంతంగా అభివర్ణించారు.
News January 10, 2025
HYD: జనవరి 31న పిల్లలకు నుమాయిష్ ఎగ్జిబిషన్ FREE
HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ఘనంగా కొనసాగుతోంది. జనవరి 31న పిల్లలకు ‘స్పెషల్ డే’గా ప్రకటించారు. పిల్లలు ఉచితంగా వెళ్లే అవకాశం కల్పించారు. కాగా, ఇటీవల జనవరి 9న లేడీస్ ‘స్పెషల్ డే’గా నిర్వహించిన సంగతి తెలిసింది. ఈసారి ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 17 వరకు కొనసాగనుంది.