News December 3, 2024
HYDలో మరో ఫ్లై ఓవర్ ఓపెన్

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం పరిధిలో రూ.5827 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వర్చువల్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆరంఘర్ నుంచి జూపార్క్ వరకు 4.04 కిలో మీటర్ల పొడవు, 6 లైన్లతో నూతన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. దీనివలన పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
Similar News
News November 18, 2025
సీఎం ప్రజావాణిలో 298 దరఖాస్తులు

ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 298 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 90, రెవెన్యూ శాఖకు 54, ఇందిరమ్మ ఇండ్ల కోసం 90, మున్సిపల్ శాఖకు 17, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 45 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వెల్లడించారు.
News November 18, 2025
తలసానిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్.. మామ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తలసానికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
News November 18, 2025
సికింద్రాబాద్ MRO ఆఫీసులో ఏసీబీ సోదాలు

సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా సర్వేయర్ కిరణ్ పట్టుబడ్డాడు. ఎమ్మార్వో కార్యాలయంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సర్వేయర్ కిరణ్‌తో పాటు చిన్న మెన్ భాస్కర్లను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


