News January 27, 2025

HYDలో మరో రైల్వే టెర్మినల్..?

image

HYDలో మరో రైల్వే టెర్మినల్ ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. SCR అధికారులు మల్కాజిగిరి రైల్వే స్టేషన్ కెపాసిటీ‌పై సర్వే చేపట్టారు. మల్కాజ్గిరి స్టేషన్ టర్మినల్ చేస్తే, నిజామాబాద్, నాందేడ్ సహా అన్ని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మేలు జరుగుతుందన్నారు. అప్పటి DRM వందన సైతం మల్కాజ్గిరిలో రైల్వే టెర్మినల్ కోసం ప్లాన్ చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత చర్యలతో మళ్లీ ఈఅంశం తెరమీదకి వచ్చింది.

Similar News

News December 5, 2025

విశాఖ: పాఠశాలలో బాలికల వాష్‌రూమ్ వద్ద యువకుడి వెకిలి చేష్టలు

image

చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఓ అపరిచిత వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరించాడు. పాఠశాలలోకి ప్రవేశించిన యువకుడు బాలికల వాష్‌రూమ్ వద్ద వెకిలి చేష్టలకు పాల్పడుతుండటాన్ని విద్యార్థినులు గమనించారు. వెంటనే వారు ప్రధానోపాధ్యాయులు ములుగు వెంకటరావుకు సమాచారం అందించారు. ప్రధానోపాధ్యాయుడు తక్షణమే పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News December 5, 2025

‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో విజయగాధలను ప్రసారం చేయండి: కలెక్టర్

image

వివిధ ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని విజయవంతమైన వారి స్ఫూర్తిదాయక విజయగాధలు తయారు చేసి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు ఆఫీస్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యీరు. ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలను పొంది విజయవంతమైన వ్యక్తులు లేదా ప్రాజెక్టుల కథలను ‘కృష్ణాస్ఫూర్తి’ పేరుతో ప్రతి రోజు వాటిని ప్రసారం చేయాలన్నారు.

News December 5, 2025

డిసెంబర్ 6న పోస్టల్ బ్యాలెట్ వినియోగించండి: పెద్దపల్లి కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సిబ్బంది డిసెంబర్ 6న పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శిక్షణ అనంతరం అదేరోజు మ.2 నుంచి సా.6 గంటల వరకు తమ ఓటు నమోదైన మండలంలోని ఎంపీడీవో కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వేసే సమయంలో ఫారం-14, ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ తప్పనిసరిగా వెంట ఉంచాలన్నారు. సూచనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ కోరారు.