News January 27, 2025
HYDలో మరో రైల్వే టెర్మినల్..?

HYDలో మరో రైల్వే టెర్మినల్ ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. SCR అధికారులు మల్కాజిగిరి రైల్వే స్టేషన్ కెపాసిటీపై సర్వే చేపట్టారు. మల్కాజ్గిరి స్టేషన్ టర్మినల్ చేస్తే, నిజామాబాద్, నాందేడ్ సహా అన్ని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మేలు జరుగుతుందన్నారు. అప్పటి DRM వందన సైతం మల్కాజ్గిరిలో రైల్వే టెర్మినల్ కోసం ప్లాన్ చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత చర్యలతో మళ్లీ ఈఅంశం తెరమీదకి వచ్చింది.
Similar News
News February 8, 2025
బాత్రూంలో 6 ఏళ్ల బాలికపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి

శంషాబాద్‌లో ఇన్‌ఫాంట్ స్కూల్ విద్యార్థినిపై బస్‌డ్రైవర్<<15391202>>అసభ్యంగా ప్రవర్తించిన<<>> విషయం తెలిసిందే. ఈనెల 4న రంగారెడ్డి జిల్లా కాగజ్‌ఘాట్‌లోని సిరినేచర్ రిసార్ట్‌కి పిక్నిక్‌కు వెళ్లిన 6ఏళ్ల బాలికపై బస్‌డ్రైవర్ బాత్రూంలో లైంగికదాడి చేశాడని విద్యార్థిని తల్లి శుక్రవారం మంచాల PSలో ఫిర్యాదు చేసింది. పాప ఇంటికి వచ్చి నొప్పిగా ఉందని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News February 8, 2025
రంగారెడ్డి జిల్లా మార్నింగ్ అప్డేట్ @7AM

రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. అత్యల్పంగా రెడ్డిపల్లిలో 14.4℃, చుక్కాపూర్ 14.7, చందనవెల్లి 15.1, కాసులాబాద్ 15.5, హైదరాబాద్ విశ్వవిద్యాలయం 15.4, మంగళపల్లి 16.3, రాజేంద్రనగర్ 15.7, కొందుర్గ్ 15.7, ఎలిమినేడు15.4, రాచలూరు 16, విమానాశ్రయం 15.8, దండుమైలారం 16.8, తొమ్మిదిరేకుల 15.8, కేతిరెడ్డిపల్లి 15.8, వైట్‌గోల్డ్ SS 16.1, వెల్జాల 16.2, అమీర్‌పేటలో 16.6℃గా నమోదైంది.
News February 7, 2025
నార్సింగిలో బాలికపై సామూహిక అత్యాచారం

రాజేంద్రనగర్‌లోని నార్సింగి PS పరిధి దారుణం జరిగింది. హైదర్ షో కోట్‌లో 4 రోజుల క్రితం బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని బాధితులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.