News January 27, 2025

HYDలో మరో రైల్వే టెర్మినల్..?

image

HYDలో మరో రైల్వే టెర్మినల్ ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. SCR అధికారులు మల్కాజిగిరి రైల్వే స్టేషన్ కెపాసిటీ‌పై సర్వే చేపట్టారు. మల్కాజ్గిరి స్టేషన్ టర్మినల్ చేస్తే, నిజామాబాద్, నాందేడ్ సహా అన్ని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మేలు జరుగుతుందన్నారు. అప్పటి DRM వందన సైతం మల్కాజ్గిరిలో రైల్వే టెర్మినల్ కోసం ప్లాన్ చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత చర్యలతో మళ్లీ ఈఅంశం తెరమీదకి వచ్చింది.

Similar News

News February 16, 2025

మెదక్: రేపటి నుంచి ఆర్థిక సర్వేకు అవకాశం: కలెక్టర్

image

ఈ నెల 16 నుంచి 28 వరకు సామాజిక, ఆర్టిక, విద్య, ఉపాది, రాజకీయ కుల సర్వే లో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. టోల్ ఫ్రీ, ప్రజాపాలన సేవా కేంద్రాలు, ఆన్లైన్ ఫామ్ డౌన్లోడ్ చేసి సమర్పించడం ద్వారా పాల్గొనవచ్చన్నారు. శనివారం జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ పాల్గొన్నారు.

News February 16, 2025

ఫ్యాన్స్‌కోసం మెగాస్టార్ కీలక నిర్ణయం?

image

గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి సినిమాలేవీ విడుదల కాలేదు. ఈ ఏడాది విశ్వంభరను దించేందుకు సిద్ధమవుతున్న ఆయన, వచ్చే ఏడాది ముగిసేలోపు మరో రెండు సినిమాల్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విశ్వంభర షూటింగ్ దాదాపు పూర్తి కాగా.. తర్వాత అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతో సినిమాల్ని వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది చివరిలోపు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సినీవర్గాలు చెబుతున్నాయి.

News February 16, 2025

MBNR: నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నం.!

image

అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన MBNR పట్టణంలో శనివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిని తన ఇంట్లోకి తీసుకొని అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా.. చిన్నారి తల్లి వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!