News June 23, 2024
HYDలో మరో MURDER..?
గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన HYD చందానగర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చందానగర్ హుడాకాలనీ సాయిబాబా ఆలయం ఆనుకొని ఉన్న నిర్జన ప్రదేశంలో మహిళ(40) మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలించగా గొంతు నులిమి ఆమెను హత్య చేసినట్లుగా అనుమానించారు. మృతురాలి ఎడమ చేతిపై బాలయ్య అనే పచ్చబొట్టు ఉందని తెలిపారు. కేసు నమోదు చేశారు.
Similar News
News November 13, 2024
HYD: సీపీ ఫోటోతో సైబర్ నేరగాళ్ల దందా.. జాగ్రత్త..!
HYD సీపీ ఆనంద్ ఫోటోతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. ఫేక్ నంబర్లతో కాల్ చేసి, అమాయక వ్యక్తులకు వలవేస్తున్నారు. దీనిపై స్పందించిన సీపీ.. డబ్బు, బ్యాంకు వివరాలు అడగటం కోసం, ఇతర పర్సనల్ సమాచారం అడగటానికి ఏ అధికారి కాల్ చేయరని, అలాంటి వాటిని నమ్మొద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
News November 13, 2024
ఓయూలో త్వరలో సంస్కరణలు: వీసీ
తార్నాక ఉస్మానియా యూనివర్సిటీలో త్వరలో సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు వీసీ ప్రొ.ఎం.కుమార్ వెల్లడించారు. ఆన్‌లైన్ లావాదేవీలు, డిజిటల్ హాజరు తదితర అంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. VC బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఠాగూర్ ఆడిటోరియంలో అధ్యాపకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న న్యాక్ గుర్తింపులో ఉత్తమ రేటింగ్ సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
News November 13, 2024
RR: ప్రతి గ్రామంలో విత్తనోత్పత్తికి రంగం సిద్ధం..!
గ్రామాల్లో విత్తనోత్పత్తికి రంగం సిద్ధమైంది. RR,MDCL,VKB జిల్లాల్లో వచ్చే ఏడాది వానకాలం నుంచి ప్రతి గ్రామంలో 5-10 మంది అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసేలా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకు, విత్తన విభాగాన్ని ఏర్పాటు చేసి, వర్సిటీ సైంటిస్టులు తయారు చేసిన విత్తనాలను పంపిణీ చేస్తారు. అనంతరం రైతులు పండించిన పంట నుంచి విత్తనాలను ఉత్పత్తి చేస్తారు.