News April 4, 2024
HYDలో మహాలక్ష్మి ఎఫెక్ట్.. తగ్గిన బస్ పాస్‌లు!

గ్రేటర్ హైదరాబాద్‌లో మహాలక్ష్మి స్కీమ్‌తో బస్‌పాస్‌లపై ప్రభావం పడింది. 2014 తర్వాత 4.50 లక్షలు ఉన్న పాస్‌ల సంఖ్య కరోనా తర్వాత 3.9 లక్షలకు తగ్గింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2023, డిసెంబర్ 9న FREE బస్ స్కీం అమల్లోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు, విద్యార్థులకు కూడా ఉచితం కావడంతో పాస్‌ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం నగరంలో 2,82,000 మంది బస్ పాస్‌లు వినియోగిస్తున్నట్లు TSRTC లెక్కలు చెబుతున్నాయి.
Similar News
News October 13, 2025
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యేకు జర్నలిజం మీద మక్కువ

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి వృద్ధాప్య సమస్యలతో HYDలోని అపోలో ఆస్పత్రిలో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన జీవితాంతంల కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2 సార్లు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఆయన జర్నలిజంపై మక్కువతో న్యూస్ సర్వీస్ సిండికేట్ సంస్థను స్థాపించారు. మరికాసేపట్లో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానానికి అంతిమయాత్ర జరగనుంది.
News October 13, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు గెజిట్ విడుదల

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. షేక్‌పేట తహశీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఇవాళ్లి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న పరిశీలన, 24న ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. వచ్చే నెల 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
News October 13, 2025
HYD: జాగ్రత్త! HSRP పేరుతో మోసాలు!

హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోలేదంటూ ఇటీవల క్యాబ్ డ్రైవర్లకు నకిలీ ఆర్టీఏ చలాన్ కాల్స్ వస్తున్నాయి. మీకు రూ.3,400 జరిమానా పడిందని మోసగాళ్లు చెబుతున్నారు. దీనిపై ఆందోళన చెందిన ఓ డ్రైవర్ స్థానిక అధికారులను సంప్రదించగా, అది నకిలీ కాల్ అని తేలింది. HSRP సంబంధించి ఎలాంటి తుది గడువును ఇప్పటివరకు ప్రభుత్వం విధించలేదని అధికారులు స్పష్టం చేశారు.