News December 7, 2024

HYDలో మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు

image

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ లక్ష్యమని చెప్పిన ప్రభుత్వం HYD నగరంలో పలుచోట్ల మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. సికింద్రాబాద్ జోన్లో స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్లను గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి ప్రారంభించినట్లు తెలిపారు.

Similar News

News January 4, 2026

ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక

image

చేవెళ్లలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాలుర బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు చెన్నయ్యగౌడ్ మాట్లాడుతూ.. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను 2 జట్లుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 10, 11న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారని వెల్లడించారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించాలన్నారు.

News January 2, 2026

HYD: AI కోర్సులకు ఫ్రీగా ఆన్‌లైన్ శిక్షణ

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ML, డేటా సైన్స్ తదితర సాఫ్ట్‌వేర్ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తామని తెలిపారు. అసక్తిగల అభ్యర్థులు జనవరి 15లోగా nationalskillacademy.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News January 1, 2026

RR : రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్

image

జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాస వేడుకలకు సంబంధించిన బ్రోచర్లను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల మొత్తం జిల్లాలో రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రవాణా శాఖ RTA – DTC, MVIలు, AMVIలు, EE R&B బృందంతో పాటు, ⁠మహేశ్వరం DCP, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ బృందం CI తదితరులు పాల్గొంటారని తెలిపారు.