News April 16, 2025
HYDలో మోటార్ వాడుతున్నారా? జాగ్రత్త..!

HYD జలమండలి అధికారుల నల్లాకు మోటార్ కనెక్షన్లపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభిచారు. మోటార్ వాడకం, నీటి వృథాను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. మాదాపూర్లో ఎండీ అశోక్ రెడ్డి పర్యటించారు. మొదటి రోజే 64 మోటార్లు స్వాధీనం చేసుకుని, 84 మందికి ఫైన్ విధించారు. మోటార్ కనెక్షన్పై ఫిర్యాదు చేయాలంటే జలమండలి అధికారునలు సంప్రదించాలని లేదా 155313కి ఈ నంబర్కు కాల్ చేయవచ్చని సూచించారు.
Similar News
News September 18, 2025
పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, పర్యాటకం, ఎంప్లాయిమెంట్, కేవీఐబీ అధికారులతో సమావేశమయ్యారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే స్థిరమైన వృద్ధిరేటు సాధించగలమన్నారు.
News September 18, 2025
ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు: జగన్

AP: అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమి ప్రభుత్వానికి లేదని YCP చీఫ్ జగన్ విమర్శించారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు టైం ఉంటుంది. ఆ గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. కానీ మండలిలో మనకు మంచి బలం ఉంది. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకం. సభ్యులకు కూడా రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశం’ అని అన్నారు.
News September 18, 2025
BREAKING: మైసమ్మగూడ చెరువులో తండ్రి, కూతురు మృతి

మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడ చెరువులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పేట్బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, హైడ్రా సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మృతులు బహదూర్పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్ (50), కూతురు దివ్య(5)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.