News February 15, 2025
HYDలో యుద్ధ విమానం తయారీ!

నగరంలోని డీఆర్డీఓతో కలిసి VEM టెక్నాలజీ సంస్థ అత్యాధునిక AMCA యుద్ధ విమానాన్ని తయారు చేసింది. కర్ణాటకలోని బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా-2025 ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా ఈ విమానం నిలిచింది. దాదాపు 60 దేశాలకు చెందిన హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి.AMCA యుద్ధ విమానాన్ని HYDలోనే పూర్తిగా అసెంబ్లింగ్ చేశారు.
Similar News
News September 19, 2025
NLG: ప్రభుత్వ టీచర్లకు టెట్ టెన్షన్

ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పట్టుకుంది. ప్రభుత్వ టీచర్లుగా కనీసం ఐదేళ్ల సర్వీస్ ఉన్న వారంతా టెట్ ఉత్తీర్ణత కావాల్సిందే అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. ఒక నల్గొండ జిల్లాలోనే సుమారుగా 2 వేల మందికి పైగా టీచర్లకు టెట్ అర్హత లేదని సమాచారం. అర్హత సాధించని వారు తమ ఉద్యోగాలు వదులుకోవాలని తీర్పులో పేర్కొనడంతో ఉపాధ్యాయ లోకం గందరగోళంలో పడింది.
News September 19, 2025
GWL: మావోయిస్ట్ మహిళా నేతకు స్థానిక సర్టిఫికెట్

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత పోతుల కల్పన @ సుజాతకు గురువారం గట్టు రెవెన్యూ ఆఫీసర్లు నేటివ్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆమె కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోగా ఆఫీసర్లు ఎంక్వయిరీ చేశారు. ఆమె 6వ తరగతి వరకు అయిజ, ఇంటర్ గద్వాలలో చదువుకున్నట్లు నిర్ధారించారు. గట్టు మండలం పెంచికలపాడు తిమ్మారెడ్డి, వెంకమ్మల కుమార్తెగా నిర్ధారించి సర్టిఫికెట్ అందజేశారు. కాగా ఆమె ఈనెల 13న హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
News September 19, 2025
దసరా సెలవులు.. స్కూళ్లు, కాలేజీలకు హెచ్చరిక

TG: దసరా సెలవుల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సెలవుల్లో రివిజన్ కోసం విద్యార్థులకు కొంత హోమ్ వర్క్ ఇవ్వాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూ.కాలేజీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉండనున్నాయి.