News February 15, 2025

HYDలో యుద్ధ విమానం తయారీ!

image

నగరంలోని డీఆర్డీఓతో కలిసి VEM టెక్నాలజీ సంస్థ అత్యాధునిక AMCA యుద్ధ విమానాన్ని తయారు చేసింది. కర్ణాటకలోని బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా-2025 ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా ఈ విమానం నిలిచింది. దాదాపు 60 దేశాలకు చెందిన హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి.AMCA యుద్ధ విమానాన్ని HYDలోనే పూర్తిగా అసెంబ్లింగ్ చేశారు.

Similar News

News March 18, 2025

సిద్దిపేట: కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దాం: DMHO

image

కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దామని డీఎంహెచ్ఓ పల్వాన్ కుమార్ అన్నారు. జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ అరుణ్ కుమార్ అధ్యక్షతన జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుష్టు రహిత సమాజాన్ని నిర్మించేందుకు జిల్లాలో మార్చి 17 నుంచి 30 వరకు క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల ద్వారా ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలున్న వారిని ముందస్తుగా గుర్తించి వైద్యం అందించనున్నట్లు తెలిపారు.

News March 18, 2025

ADB: పోలీసులను బెదిరించిన మహిళపై కేసు: CI

image

మట్కా జూదం నిర్వహిస్తున్న మహిళాగ్యాంగ్‌ను ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు స్థానిక ఇంద్రానగర్‌లో అరెస్టు చేశారు. అరెస్టు చేసే క్రమంలో ఫర్జానా సుల్తానా అనే మహిళ పోలీస్ స్టేషన్‌కు రానని.. తనను స్టేషన్కు తీసుకెళ్తే గొంతు కోసుకుంటానంటూ పోలీసులను బెదిరించింది. బ్లేడుతో గొంతు కోసుకోవడానికి ప్రయత్నించి భయపెట్టించింది. దీంతో ఆమెపై మట్కా కేస్‌తోపాటు బెదిరించినందుకు మరో కేసును నమోదు చేసినట్లు CI కరుణాకర్ తెలిపారు.

News March 18, 2025

ములుగు: అనుమానస్పద స్థితిలో మహిళా మృతి..?

image

కాటాపూర్ గ్రామానికి చెందిన ఈశ్వరి అనే మహిళ సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనుమానస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన ఈశ్వరి పక్కింటి వారితో గొడవపడ్డారని.. అనంతరం ఆమె ఇంట్లో మృతిచెంది కనిపించిందని తెలిపారు. ఈశ్వరి ఒంటిపై గాయాలు ఉన్నాయని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హత్యనా.? ఆత్మహత్యనా.? అనే కోణంలో విచారిస్తున్నారు.

error: Content is protected !!