News September 15, 2024

HYDలో రాపిడో రైడర్‌ దారుణహత్య

image

HYD బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పంచశీలకాలనీ సమీపంలో కొత్తగూడెంకు చెందిన దినేశ్ దారుణహత్యకు గురయ్యాడు. నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. మృతుడు రాపిడో బైక్ రైడర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 21, 2025

HYD: BRSలో చేరిన BJP మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్

image

BJP మైనార్టీ మోర్చా సోషల్ మీడియా విభాగం మహిళా కన్వీనర్ రిదా ఖుద్దూస్ ఈరోజు BRSలో చేరారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి HYDలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్ మహ్మద్ బిన్ అలీ అల్ గుత్మి కూడా ఆమెతోపాటు BRSలో చేరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు నిజమైన అభివృద్ధి జరుగుతుందని, అందుకే BRSలో చేరుతున్నట్లు వారు చెప్పారు.

News October 21, 2025

జూబ్లీహిల్స్‌లో బీజేపీ-మజ్లిస్ మధ్యే ప్రధాన పోటీ: రాంచందర్‌రావు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BJP, మజ్లిస్ మద్దతు తెలిపిన కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ జరుగుతోందని TBJP చీఫ్ రామచందర్‌రావు అన్నారు. BJP అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. వారు పోటీలో ఉన్నట్లు నటించడమే తప్పు. వాస్తవానికి ప్రజలు ఇప్పటికే బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారు. జూబ్లీహిల్స్‌లో పథకాలు అమలు కావట్లేదు. సమస్యలు పట్టిపీడిస్తున్నాయి’ అన్నారు.

News October 21, 2025

జూబ్లీహిల్స్: బీజేపీ ర్యాలీలో టీడీపీ జెండాలు..!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీ ఈరోజు భారీగా జరిగింది. అయితే ర్యాలీలో బీజేపీ జెండాలతోపాటు టీడీపీ జెండాలు కూడా దర్శనమిచ్చాయి. పలువురు కార్యకర్తలు టీడీపీ జెండాలు చేతపట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఆంధ్రలో కూటమిలో భాగమైన బీజేపీ, టీడీపీ, జనేసేన కార్యకర్తలు పాల్గొని లంకల దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.