News February 17, 2025
HYDలో రూపాయి ఖర్చు లేకుండా పెళ్లి!

హైదరాబాద్‌లో పైసా ఖర్చులేకుండానే ఓ జంట వివాహం చేసుకుంది. అది కూడా కేవలం రెండు నిమిషాల్లోనే. శంషాబాద్‌లోని కన్హా శాంతివనంలో సర్వేశ్వరానంద్, శ్రీవాణి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆమె మెడలో తాళి కట్టాడు. ప్రశాంతమైన శాంతి వనంలో ఆర్భాటం లేకుండా ఆ జంట వివాహమైంది.
Similar News
News April 17, 2026
రంగారెడ్డిలో భానుడి భగభగ.. జనం విలవిల

ఉమ్మడి జిల్లాను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌లో 41.8, మేడ్చల్‌లో 41.7 డిగ్రీల వేడి రికార్డయ్యింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మధ్యాహ్నం వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

News April 16, 2026
RR: హీట్ వేవ్.. ఇవి తప్పని సరి: DMHO

RR జిల్లాలో తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డా. లలితాదేవి సూచించారు. మజ్జిగ, కొబ్బరినీళ్లు, ORS తీసుకోవాలని, మ.12 నుంచి సా.4 వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చారించారు. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి అవసరమైతే 108కు సమాచారం ఇవ్వాలని సూచించారు.