News February 1, 2025

HYDలో రూ. 50కే డోర్ డెలివరీ!

image

HYDలో ఎక్కడికైనా కేవలం రూ.50కే కిలో వరకు బరువు కలిగిన సామగ్రిని డోర్ డెలివరీ చేస్తున్నట్లు ఆర్టీసీ కార్గో అధికారులు తెలిపారు. నగరవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వస్తువు బరువు ప్రకారం ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ, ఎల్బీనగర్ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా కార్గో కౌంటర్లు ఏర్పాటు చేశారు.SHARE IT

Similar News

News November 14, 2025

బాల కార్మిక రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

బాపట్లను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల కార్మికుల గుర్తింపుపై చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు పనితీరు మెరుగుపరచాలని సూచించారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో కార్మికుల నమోదు వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

News November 14, 2025

పులివెందులలో వ్యక్తి దారుణ హత్య.?

image

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురంలో శుక్రవారం రాత్రి దారుణ హత్య జరిగింది. గొర్ల వంశీకృష్ణ (30)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించాగా మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. వంశీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 14, 2025

సిరిసిల్ల జిల్లాలో 12,150 మంది మధుమేహ బాధితులు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12,150 మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా వైద్యులు డయాబెటిస్ నివారణ చర్యలను సూచించారు. 3 నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ ఆహార నియమాలు పాటిస్తే డయాబెటిస్ అదుపులో ఉంటుందని తెలిపారు. డయాబెటిస్ ఉందని భయపడాల్సిన అవసరం లేదని, ప్రతినిత్యం ఉదయం నడకతో పాటు, ఎక్సర్‌సైజ్ చేయాలని సూచించారు.