News October 11, 2024
HYDలో రేపు డబుల్ ధమాకా

హైదరాబాద్‌లో ఈ దసరాకు తగ్గేదే లేదు. విందుకు వినోదం జతకానుంది. రేపు దసరాతో పాటు ఉప్పల్ వేదికగా ఇండియా VS బంగ్లాదేశ్ T-20 మ్యాచ్ జరగనుంది. నగరం అంతటా ఇక సందడే సందడి. ఉదయం నుంచే ఆలయాలు, అమ్మవారి మండపాలు కిక్కిరిసిపోతాయి. మధ్యాహ్నం బలగం అంతా కలిసి విందులో పాల్గొంటారు. సాయంత్రం వరకు హైదరాబాద్ అంతటా దసరా వైభోగమే. దీనికితోడు రాత్రి మ్యాచ్ ఉండడంతో క్రికెట్ ప్రియులు డబుల్ ధమాకా అంటున్నారు.
Similar News
News November 6, 2025
HYD: చీమలకు భయపడి వివాహిత సూసైడ్

చీమలకు భయపడి వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్పూర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) ఫోబియాతో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
News November 6, 2025
‘అప్పుడే సింగూరును ఖాళీ చేస్తాం’

నగరానికి తాగునీటిని అందించే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనుల కోసం అందులోని నీటిని ఖాళీ చేయాలని నిపుణులు నిర్ణయించారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తరువాతే డ్యామ్‌లో నీటిని ఖాళీ చేస్తామని ఈఈ జైభీమ్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రాజెక్టు రిపేరుకు సంబధించి అధికారులు పలువురు ఎక్స్ పర్ట్స్ సలహాలు తీసుకోనున్నారు. ఐఐటీ హైదరాబాద్ ఇంజినీరింగ్ నిపుణులతో పరిశీలింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News November 6, 2025
బీఆర్ఎస్ పోరాటం.. కాంగ్రెస్ ఆరాటం.. బీజేపీ ప్రయత్నం

జూబ్లీహిల్స్ బై పోల్స్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపుకోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. ఎలాగైనా గెలిచి తమ సీటు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పోరాటమే చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేబినెట్ మంత్రులందరికీ ప్రచారంలోకి దించి గెలవాలని ఆరాటపడుతోంది. వీరికితోడు బీజేపీ కూడా గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. మరి కృషి ఎవరి ఫలిస్తుందో 14 వరకు ఆగాల్సిందే.


