News March 13, 2025

HYDలో రేపు మద్యం దుకాణాలు బంద్: సీపీ

image

హోలీ పండుగను పురస్కరించుకొని ఈనెల 14వ తేదీ ఉ.6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి గుంపులు గుంపులుగా తిరుగుతూ.. హంగామా చేస్తే చర్యలు తప్పవని హెచ్చారించారు.

Similar News

News March 14, 2025

బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కార్

image

HYDలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెం.1లో నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్‌పాత్‌పైకి ఓ కారు దూసుకెళ్లింది. అతివేగంతో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను కారు ఢీకొట్టింది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 మీదుగా చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఫెన్సింగ్‌తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. కాగా.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

News March 14, 2025

HYD: హోలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత: సీపీ

image

35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం ఒకేరోజు రావడంతో HYD సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రతీ జోన్, సున్నితమైన  ప్రాంతాల్లో పికెట్‌లు ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ చైతన్య కుమార్ పాల్గొన్నారు. 

News March 14, 2025

జిల్లాలో కొనసాగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

రంగారెడ్డి జిల్లాలో ఎండ మండిపోతుంది. గురువారం కొత్తూర్, చందనవెల్లిలో 39.8℃, షాబాద్, మహేశ్వరం, ప్రొద్దుటూరు 39.7, మహంకాళ్, రెడ్డిపల్లె 39.6, చుక్కాపూర్, కేతిరెడ్డిపల్లి 39.5, తాళ్లపల్లి 39.4, మణికొండ 39.3, మొగల్గిద్ద, తోమ్మిడిరేకుల, మంగళ్‌పల్లి 39.3, పెద్దఅంబర్‌పేట్, మొయినాబాద్, మామిడిపల్లె, అబ్దుల్లాపూర్‌మెట్, తట్టిఅన్నారం 39.2, ధర్మసాగర్, ఆరుట్లలో 39.1℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!