News March 13, 2025
HYDలో రేపు మద్యం దుకాణాలు బంద్: సీపీ

హోలీ పండుగను పురస్కరించుకొని ఈనెల 14వ తేదీ ఉ.6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి గుంపులు గుంపులుగా తిరుగుతూ.. హంగామా చేస్తే చర్యలు తప్పవని హెచ్చారించారు.
Similar News
News December 4, 2025
HYD: చెస్ ఆడతారా.. ₹22లక్షలు గెలుచుకోవచ్చు

తెలంగాణలో తొలి అతిపెద్ద ప్రైజ్మనీ చెస్ టోర్నమెంట్ డిసెంబర్ 20, 21 తేదీల్లో హిటెక్స్లో జరుగనుంది. ఎక్కారా చెస్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్లో గెలుపొందితే ₹22.22 లక్షలు ప్రైజ్ మనీ సొంత చేసుకోవచ్చు. రాష్ట్రంలో భారీ స్థాయిలో జరుగుతున్న మొదటి చెస్ టోర్నీ అని నిర్వాహకులు తెలిపారు. SHARE IT
News December 4, 2025
The ‘Great’ హైదరాబాద్

విలీనంతో HYD దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది. విలీనం అనంతరం బల్దియా స్థితి గతులను పరిశీలిస్తే..
GHMC విస్తీర్ణం: 2735 చదరపు కిలో మీటర్లు
జనాభా: దాదాపు కోటిన్నర
మేయర్, 149 మంది కార్పొరేటర్లు+300 డివిజన్లకు ఆస్కారం
కమిషనర్, 10 మంది అదనపు కమిషన్లర్లు
23 మంది MLAలు+కొత్తగా ఇద్దరు MLAలు?
6 జోన్లు+ఆరుగురు జోనల్ కమిషనర్లు
57 సర్కిళ్లు+57మంది డిప్యూటీ కమిషనర్లు
News December 4, 2025
Elon Musk బృందంతో సీఎం రేవంత్ ముఖాముఖి!

గ్లోబల్ సమ్మిట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు భారీ హాంగర్లలో ఏర్పాటు చేసిన సదస్సులో CM కీలక ప్రసంగం చేయనున్నారు. హాల్-1లో 100 మంది ప్రతినిధులు, హాల్-2లో 60 మంది ప్రతినిధులు, 20 మంది ఎంవీఐపీల(దిగ్గజ కంపెనీల CEOలు)తో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఎలన్ మస్క్ బృందంతో కూడా సీఎం ప్రత్యేకంగా చర్చిస్తారు. అయితే, Musk సదస్సుకు హాజరవుతారా? లేదా? అన్న విషయంపై అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు.


