News March 13, 2025

HYDలో రేపు మద్యం దుకాణాలు బంద్: సీపీ

image

హోలీ పండుగను పురస్కరించుకొని ఈనెల 14వ తేదీ ఉ.6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి గుంపులు గుంపులుగా తిరుగుతూ.. హంగామా చేస్తే చర్యలు తప్పవని హెచ్చారించారు.

Similar News

News March 13, 2025

2లక్షల మందికి శిక్షణ ఇచ్చేలా మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం

image

AP: ఏఐ, డిజిటల్ ప్రొడక్టివిటీలో ఏటా 2లక్షలమందికి శిక్షణ ఇచ్చేలా మైక్రోసాఫ్ట్‌తో APSSD ఒప్పందం చేసుకొంది. 50 ఇంజినీరింగ్ కాలేజీల్లో 500 మంది అధ్యాపకులకు మైక్రోసాఫ్ట్‌ శిక్షణ, 10వేల మంది విద్యార్థులకు ఏఐ , క్లౌడ్ కంప్యూటరింగ్‌లో ట్రైనింగ్ ఇవ్వనుంది. అదే విధంగా 30 ఐటీఐల్లో 30వేల మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో శిక్షణ ఇవ్వనున్నారు. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

News March 13, 2025

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

image

2025 మార్చి ఒకటి నుంచి నెల్లూరు జిల్లాలో 79 కేంద్రాలలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రధాన పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్మీడియట్ బోర్డు నెల్లూరు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు. గురువారం నాటి జనరల్ విభాగంలో 27,753 మంది విద్యార్థులకు గాను 792 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, ఒకేషనల్ విభాగంలో 730 మందికి గాను 104 మంది గైర్హాజరయ్యారన్నారు.

News March 13, 2025

BC-D కేటగిరిలో 3వ ర్యాంకు సాధించిన ధర్మపురి వాసి

image

ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామానికి చెందిన రేణు మోహన్ ఇటీవల విడుదల అయినా గ్రూప్-2 ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 155 ర్యాంకు, బాసర జోన్లో 11వ ర్యాంకు, BC-D కేటగిరి లో 3వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం నిజామాబాద్ బిసి సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఐలయ్య, నర్సవ్వ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!