News March 13, 2025

HYDలో రేపు మద్యం దుకాణాలు బంద్: సీపీ

image

హోలీ పండుగను పురస్కరించుకొని ఈనెల 14వ తేదీ ఉ.6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి గుంపులు గుంపులుగా తిరుగుతూ.. హంగామా చేస్తే చర్యలు తప్పవని హెచ్చారించారు.

Similar News

News April 17, 2026

విజయవాడ నుంచి ‘డ్రగ్స్’ సరఫరా.. ముగ్గురి అరెస్ట్!

image

హైదరాబాద్‌లోని కొండాపూర్ వేదికగా సాగుతున్న డ్రగ్స్ దందాను ఎక్సైజ్ పోలీసులు ఛేదించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మత్తు పదార్థాలను తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 6.09 గ్రాముల MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ ముఠా మురళి, వికాస్, భరత్ అనే వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా వెనుక ఉన్న ఇతర నెట్‌వర్క్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

News April 17, 2026

పరుచూరి చెప్పిన జీవిత సూత్రం!

image

అతి మంచితనం, మొహమాటంతో ‘నో’ చెప్పలేకపోవడం వల్ల జీవితంలో అనేక చిక్కులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాటిచ్చి ఇబ్బందుల్లో పడేవారు చాలామంది. దీనిపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరికైనా మాట ఇచ్చేముందు పదిసార్లు ఆలోచించాలి. నోరు విప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమయానుకూలంగా NO చెప్పడం నేర్చుకోండి’ అని ఆయన సూచించారు.

News April 17, 2026

దేవుడి కంటే BCCI వద్దే ఎక్కువ డబ్బు.. అయినా: లలిత్ మోదీ

image

భారత్‌లో ఉన్న స్టేడియాలపై IPL ఫౌండర్ లలిత్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. BCCI వద్ద దేవుడి కంటే ఎక్కువ డబ్బు ఉందని, అయినా స్టేడియాల దుస్థితి మారట్లేదని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. BCCI వాటిని కూల్చేసి కొత్తవి నిర్మించాలని తెలిపారు. ఇక 2030 నాటికి IPLలో ఒక్కో అగ్రశ్రేణి ఆటగాడు రూ.150CR వరకు సంపాదిస్తారని జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఆటగాళ్లు దేశ జట్టు కంటే IPLకే ప్రాధాన్యతనిస్తారన్నారు.