News November 18, 2024
HYDలో రేపే ఫుట్‌బాల్ మ్యాచ్

హైదరాబాద్‌లో రేపు ఇండియా, మలేషియా మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా రేపు రాత్రి 7 గంటలకు ఫుట్ బాల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
Similar News
News December 1, 2025
గ్లోబల్ సిటీగా మారనున్న హైదరాబాద్

గ్రేటర్ హైదరాబాద్ త్వరలోనే గ్లోబల్ సిటీగా మారనుంది. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలను విలీనం చేసిన నేపథ్యంలో ఈ ఘనత సాధించనుంది. జనాభా పరంగా ఇప్పటికే 1.85 కోట్లకి చేరుకుంది. మున్సిపాలిటీల విలీనంతో మరింత జనాభా పెరగనుంది. జనాభాకు తగ్గట్టుగా వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జనాభాతో పాటుగా అభివృద్ధిలోను గ్రేటర్ హైదరాబాద్ దూసుకెళ్లనుంది.
News December 1, 2025
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 ఫుట్‌బాల్ స్టేడియాలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 ఫుట్‌బాల్ స్టేడియాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. రెడ్ హిల్స్, కాప్రా, మల్లేపల్లిలో ఈ స్టేడియం నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనికోసం రూ.15 కోట్లు కేటాయించారు. ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలలో టెండర్లను పిలిచే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు.
News December 1, 2025
HYD: ఆన్లైన్ బెట్టింగ్.. మరో యువకుడు బలి

ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఉప్పల్‌కు చెందిన సాయి (24) శాంతినగర్‌లో పురుగుల మందు తాగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతి స్థానికంగా కలకలం రేపింది.


