News September 22, 2024

HYDలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు: కమిషనర్

image

గణేశ్ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. శనివారం జోనల్ కమిషన్లు, అడిషనల్ కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు నగరంలోని వీధుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.

Similar News

News November 15, 2025

HYD: ఈనెల 17న ‘మీ డబ్బు-మీ హక్కు’ జిల్లా స్థాయి శిబిరం: కలెక్టర్

image

‘మీ డబ్బు-మీ హక్కు’లో భాగంగా ఈనెల 17న బాగ్ లింగంపల్లిలోని TGSRTC కళ్యాణ మండపం వద్ద జిల్లా స్థాయి శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా “మీ డబ్బు- మీహక్కు” అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు జాతీయస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

News November 15, 2025

HYD: పదే పదే లీకేజీలతో.. నీటి సరఫరాలో అంతరాయం

image

HYD నగరానికి నీటి సరఫరా చేసే జలమండలి పైప్ లైన్లు పదే పదే లీకేజీ కావడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. 2,3 రోజులపాటు ప్రజల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా జలమండలి తగిన చర్యలు తీసుకోవాలని నగరంలోని సరూర్‌నగర్, ఉప్పల్, నాంపల్లి, అత్తాపూర్ ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News November 15, 2025

HYD: BRSకు BYE.. BYE: కాంగ్రెస్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ BRS టార్గెట్‌గా ట్వీట్ చేసింది. ‘మొన్న గ్రామాలు.. నేడు HYD సిటీ BRSకు బై.. బై చెప్పాయి.. గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నారు.. రాబోయే రోజుల్లో ఆ పార్టీ ఇక కనుమరుగు అవుతుంది’ అంటూ పేర్కొంది. కాగా HYD ప్రజలు అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ వైపే ఉన్నారన్న దానికి ఈ గెలుపు నిదర్శనమని ఆ పార్టీ నేతలు అన్నారు.