News October 1, 2024

HYDలో విడాకులు ఎక్కువగా తీసుకునేది వీరే!

image

గ్రేటర్ హైదరాబాద్‌లోని కుటుంబ న్యాయస్థానాల్లో ప్రతీనెల 300కు పైగా విడాకుల కేసులు నమోదవుతున్నాయి. చిన్నాచితక సమస్యలను సైతం ఆలుమగలు అర్థం చేసుకోకపోవడంతో కౌన్సెలింగ్ సెంటర్లకు 10 నుంచి 15% మంది వెళ్తున్నారంటే సమస్య ఎంత జటిలంగా ఉందో అర్థమవుతోంది. వీరిలో అత్యధికంగా 25 నుంచి 35లోపు వయసు ఉన్న జంటలు 75% ఉండగా.. వారిలో ఐటీ ఉద్యోగులు ఎక్కువమంది ఉంటున్నారని తేలింది.

Similar News

News December 16, 2025

HYD: ‘చే’ చివరిపోరుకు ‘బొలీవియా డైరీ’ రూపం

image

‘బొలీవియా డైరీ’లో చేగువేరా చివరి రోజులు, గెరిల్లా పోరాటం, <<18569067>>విప్లవంపై<<>> ఆయన అచంచల నిబద్ధత.. హృదయాన్ని ఇందులోని అక్షరాలు కదిలిస్తాయి. ఆకలి, వ్యాధులు, ద్రోహం, అపజయాల మధ్య వెనకడుగు వేయని విప్లవ ఆత్మ ప్రతి పుటలో ఉప్పొంగుతుంది. విజయానికి మించిన సిద్ధాంత విశ్వాసమే చేగువేరా జీవన తత్వంగా బలమైన ముద్ర వేసింది. ఇది కేవలం పర్సనల్ డైరీ కాదు.. ప్రపంచ విప్లవ చరిత్రలో ఒక అమర పుట. ఇది యువతను ఆలోచింపజేసే రచన.

News December 16, 2025

డేంజర్‌లో హైదరాబాద్‌

image

హైదరాబాదులో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరుకుంది. ఎయిర్ పొల్యూషన్‌, చెత్తాచెదారం, పొగ మంచు, వాహనాల పొగ కారణంగా ఎయిర్ క్వాలిటీ క్షీణిస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్‌లోకి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ 220 ఎయిర్ క్వాలిటీ ఉంది. అంటే చాలా మంది జనాలు అనారోగ్య బారిన పడటమే కాకుండా ఆస్తమా వాళ్లకు ప్రాణ ముప్పు ఉంటుంది.

News December 16, 2025

HYD: భగత్‌సింగ్ వీలునామా.. విప్లవానికి అక్షరనామా

image

‘భగత్‌సింగ్ వీలునామా’ నవల స్వాతంత్ర్య సమరయోధుడి ఆలోచనా, త్యాగస్ఫూర్తిని గుండెను తాకేలా ఆవిష్కరిస్తుంది. విప్లవం ఆయుధాలతోనే కాదు, ఆలోచనలతోనూ సాగుతుందన్న సత్యాన్ని బలంగా చాటిందీ పుస్తకం. భగత్‌సింగ్ ఆశయాలు, సమాజ మార్పుపై ఆయన కలలు ప్రతి పుటలో ప్రతిధ్వనిస్తాయి. యువతను ఆలోచింపజేసే ఈ రచన, దేశభక్తికి కొత్త నిర్వచనం చెబుతుంది. పాఠకుడిని లోతైన ఆలోచనలోకి నెట్టే బాధ్యతాయుత రచన. అందరూ చదవాల్సిన నవల ఇది.