News November 19, 2024
HYDలో వెహికల్ ఫిట్నెస్ కేంద్రాల ఏర్పాటు..!
HYD ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఇక నుంచి వాహనాల ఆటోమేటెడ్ ఫిట్నెస్ చెకింగ్ కోసం 5-6 కేంద్రాల ఏర్పాటుపై వేగం పెంచింది. మల్కాజిగిరి, తిరుమలగిరి సహా, ఇబ్రహీంపట్నం మరికొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం దాదాపుగా రూ.8 కోట్ల మేర వ్యయం కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Similar News
News December 5, 2024
HYD: ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న వర్సిటీ రిజిస్ట్రార్…!
JNTU రిజిస్ట్రార్ తీరు పై వర్సిటీ డైరెక్టర్ లే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వర్సిటీలు డైరెక్టర్లకు కార్లు, డ్రైవర్ల కేటాయింపులో రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు వివక్ష చూపిస్తున్నారని కొందరు డైరెక్టర్లు ఆరోపించారు. బుధవారం రిజిస్ట్రార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈవిషయం చర్చకు రాగా సమావేశం కాస్త రసాభాసగా మారింది. వర్సిటీలో పాలనాపరంగా రిజిస్ట్రార్ ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారని ఆరోపించారు.
News December 5, 2024
మాదాపూర్‌లో నేడు గవర్నర్, సీఎం పర్యటన
మాదాపూర్‌లోని శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క నేడు ప్రారంభించనున్నారు. 106 షాపులు ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. సందర్శకులకు, స్టాల్ నిర్వాహకులకు, తాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు.
News December 5, 2024
HYD: గాంధీ ఆస్పత్రికి రేవతి మృతదేహం తరలింపు
RTC X రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన <<14793966>>తొక్కిసలాటలో రేవతి<<>> చనిపోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. దిల్‌సుఖ్‌నగర్ వాసి రేవతి(39), భర్త భాస్కర్, పిల్లలు శ్రీతేజ్(9), సన్వీక(7)తో కలిసి అభిమాన హీరో మూవీ పుష్ప-2 చూసేందుకు వెళ్లారు. అయితే తొక్కిసలాటలో రేవతి చనిపోగా బాలుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలవడంతో బేగంపేట కిమ్స్‌కు తరలించారు. రేవతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలో చూసి బంధువులు బోరున విలపించారు.