News December 12, 2024

HYDలో వైజాగ్ యువతి‌తో సహజీవనం.. మోసం!

image

యువతితో సహజీవనం చేసి ఆమె నుంచి రూ.లక్షల్లో తీసుకొని ఉడాయించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధురానగర్ PS పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వైజాగ్‌‌కు చెందిన యువతి HYDలో బ్యూటీషియన్‌గా పని చేస్తూ స్థిరపడింది. ఆమెకు ఓ క్యాబ్‌డ్రైవర్ పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో సహజీవనం చేశాడు. పెళ్లి ప్రస్తావన రాగానే ఇద్దరి మతాలు వేరు అంటూ ముఖం చాటేశాడు. అతడి కోసం మతం మారినా మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News December 4, 2025

ఫ్యూచర్ సిటీ: ప్రభుత్వ ప్రాధాన్యతలివే!

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ఎగ్జిబిషన్ ఫ్లోర్ ప్లాన్ లీక్ అయింది. మ్యాప్ ప్రకారం, ఎగ్జిబిషన్ కేంద్ర బిందువు 5 మీటర్ల డోమ్ కాగా, అగ్రస్థానం భారత్ ఫ్యూచర్ సిటీకి దక్కింది. కీలకమైన డిఫెన్స్/స్పేస్ (1, 2) స్టాల్స్, MRDC పక్కన హాల్ పైభాగంలో ఉన్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు, రాబోయే పెట్టుబడులు ఏ రంగం వైపు మొగ్గు చూపుతున్నాయో ఈ లేఅవుట్ స్పష్టం చేస్తోంది. ఇది కేవలం ప్లాన్ కాదు, తెలంగాణ టార్గెట్!

News December 4, 2025

HYD: గూగుల్‌మ్యాప్స్ ఫాలో అవుతున్నారా? జాగ్రత్త!

image

గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్తున్నారా? మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాత్రుళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. బోడుప్పల్‌లో ఓ వ్యక్తి తన వాహనంలో గుడ్డిగా దీన్ని నమ్మి బోడుప్పల్- పోచారం రూట్లో వెళ్లాడు. కుడివైపు మొత్తం మట్టి రోడ్డు ఉన్నప్పటికీ నావిగేషన్ అటువైపే చూపించింది. కొద్ది దూరం వెళ్లాక రోడ్డు లేకపోగా, భారీ గుంతలో పడ్డట్టు తెలిపారు. మీకూ ఇలా రాంగ్ డైరెక్షన్ చూపించిందా?

News December 4, 2025

HYD: పెరుగుతున్న కేసులు.. జాగ్రత్త!

image

HYDలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సలు దాదాపు పదికిపైగా ఆస్పత్రులు అందిస్తున్నాయి. అయితే.. నెలకు 200 మంది వరకు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకుంటున్నట్లు MNJ వైద్యులు గుర్తించారు. ఇన్ఫెక్షన్లు, ల్యూకేమియా, ఇన్ఫోమా, మైలోమా వంటి బ్లడ్ క్యాన్సర్లకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ పరిష్కారమని చెబుతున్నారు. ఊబకాయులు, పెరగుతున్న వయసు, పురుషుల్లో అధికంగా దీని లక్షణాలు కనిపిస్తున్నట్లు తేల్చారు.