News March 4, 2025
HYDలో శిరీషను చంపి డ్రామా!

మలక్‌పేట జమున టవర్స్‌లో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. 2016లో వినయ్‌ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. మలక్‌పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News November 22, 2025
HYD: అన్నపూర్ణ ఫిల్మ్ అకాడమీని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినీ నటుడు నాగార్జునతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు. 1970లలో సరైన వసతులు లేనప్పుడు దిగ్గజ అక్కినేని నాగేశ్వరరావు ఈ స్టూడియోను స్థాపించడం, అది హైదరాబాద్‌లో ముఖ్యమైన సాంస్కృతిక ల్యాండ్‌మార్క్‌గా ఎదగడంపై డిప్యూటీ సీఎం ప్రశంసలు కురిపించారు.
News November 22, 2025
HYD: స్టేట్ క్యాడర్ మావోయిస్టులు లొంగుబాటు.!

రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) బి.శివధర్ రెడ్డి ముందు నేడు భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు. స్టేట్ క్యాడర్‌కు చెందిన అజాద్, అప్పా నారాయణ, ఎర్రాలు సహా పలువురు మావోయిస్టులు లొంగుబాటు కార్యక్రమానికి హాజరు కానున్నారు. లొంగుబాటుకు సంబంధించిన మరిన్ని వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.
News November 22, 2025
HYD: పంచాయతీ ఎన్నికలు.. అబ్జర్వర్లతో ఎస్ఈసీ కీలక సమావేశం

తెలంగాణలో పంచాయితీ ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల సిద్ధతల్లో భాగంగా ఈరోజు జిల్లాలవారీగా అబ్జర్వర్లతో ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. వచ్చే వారంలోనే పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి దశలో ఉన్నాయి. అబ్జర్వర్లతో కీలక సమావేశం పూర్తయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకొని షెడ్యూల్ విడుదల చెయ్యనుంది.


