News March 4, 2025

HYDలో శిరీషను చంపి డ్రామా!

image

మలక్‌పేట జమున టవర్స్‌లో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. 2016లో వినయ్‌ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. మలక్‌పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News April 19, 2026

హైదరాబాద్‌లో హడలెత్తిస్తోన్న ‘హార్ట్ స్ట్రోక్’

image

హైదరాబాద్‌లో ‘హార్ట్ స్ట్రోక్’ హడలెత్తిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా ఆకస్మిక గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయి. చెడు అలవాట్లు లేని వారినీ ఈ ప్రాణాంతక వ్యాధి వదలడం లేదు. ఛాతిలో నొప్పిగా అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. నిత్య వ్యాయామం, సమతుల్య ఆహారం, సరిపడా నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొంటున్నారు.

ఉప్పల్ స్టేడియంలో తండ్రీకొడుకుల డ్యూటీ

image

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ బందోబస్తులో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఎస్‌బీ ఏసీపీ రవీందర్ రెడ్డి, ఆయన కుమారుడు ట్రైనీ డీఎస్సీ శంతన్ కుమార్ రెడ్డి ఒకే చోట విధులు నిర్వహించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ పోలీసు శాఖలో ఉండటంతో అక్కడున్న అధికారులు, సిబ్బంది వారిని అభినందించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అధికారులు ఒకే కార్యక్రమంలో విధులు నిర్వర్తించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.