News March 4, 2025
HYDలో శిరీషను చంపి డ్రామా!

మలక్‌పేట జమున టవర్స్‌లో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. 2016లో వినయ్‌ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. మలక్‌పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News November 17, 2025
గంజాయి టెస్ట్.. స్పాట్లోనే రిజల్ట్స్!

TG: గంజాయిని శాశ్వతంగా అరికట్టడానికి పోలీస్ శాఖ నయా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అనుమానం ఉన్నవారిని ‘యూరిన్ టెస్ట్ కిట్’తో టెస్ట్ చేసి స్పాట్లోనే ఫలితాన్ని నిర్ధారిస్తారు. సైబరాబాద్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్ల పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా పీఎస్‌లకు యూరిన్ కిట్లను పంపిణీ చేసినట్లు సమాచారం.

చిత్తూరు: 27 మంది సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఆదేశించారు. అనధికారికంగా సెలవుపై ఉండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. మెడికల్ లీవ్‌లో ఉన్న 152 మందిని మెడికల్ బోర్డులో పరీక్షల నిర్వహించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.