News March 4, 2025
HYDలో శిరీషను చంపి డ్రామా!

మలక్‌పేట జమున టవర్స్‌లో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. 2016లో వినయ్‌ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. మలక్‌పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News March 23, 2025
ఉప్పల్‌లో IPL మ్యాచ్.. జాగ్రత్త బ్రో!

HYDలోని ఉప్పల్ వేదికగా ఇవాళ IPL జట్లు SRH, రాజస్థాన్ పోటీ పడుతున్నాయి. అయితే స్టేడియంలో ఆకతాయిల పని పట్టేందుకు ‘షీ టీమ్స్’ మఫ్టీలో మహిళల రక్షణను పర్యవేక్షిస్తున్నాయి. అమ్మాయిలను ఇబ్బంది పెడితే తాటతీసేలా చర్యలు ఉండనున్నాయి. మరోవైపు 2,700 మంది పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించారు. IPL స్కోర్ అప్‌డేట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.
News March 23, 2025
పెద్ద పట్నం కార్యక్రమంలో పాల్గొన్న ఛైర్మన్

ప్రముఖ శైవ క్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి ఆదివారం రోజున ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పెద్ద పట్నం, మల్లిఖార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
News March 23, 2025
ప.గో: పది నెలల పాటు జైలులోనే బాల్యం..!

పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన పసల కృష్ణమూర్తి – అంజలక్ష్మి దంపతుల కుమార్తె కృష్ణ భారతి ఆదివారం మృతి చెందారు. భీమవరం సబ్ కలెక్టరేట్ వద్ద జెండా ఎగురవేసిన సందర్భంలో కృష్ణ భారతి తల్లిదండ్రులు జైలు శిక్ష అనుభవించారని గ్రామస్థులు తెలిపారు. నాడు అంజలక్ష్మి ఆరు నెలల గర్భవతి. జైలులోనే కృష్ణ భారతికి అంజలక్ష్మి జన్మనిచ్చారు. కృష్ణ భారతి బాల్యం మొదటి పది నెలలు జైలులోనే గడిపారని తెలిపారు.