News March 5, 2025

HYDలో శిరీష హత్య కేసులో ట్విస్ట్

image

మలక్‌పేటలో శిరీష హత్య కేసులో మరో కోణం వెలుగుచూసింది. భర్త వినయ్ సోదరి సరిత హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. మత్తు మందు ఇచ్చి మర్డర్ చేసినట్లు నిర్ధారించారు. ఇది తెలిసి వినయ్ మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడు. గుండెపోటుతో చనిపోయిందని చిత్రీకరించాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News October 27, 2025

ఎయిమ్స్ రాయ్‌బరేలిలో 149 పోస్టులు

image

రాయ్‌బరేలిలోని<> ఎయిమ్స్ <<>>149 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు NOV 3న రిపోర్టింగ్ చేయాలి. NOV 4, 28న డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. DEC 12న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పోస్టును బట్టి MD/MS/DNB/DM ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://aiimsrbl.edu.in/

News October 27, 2025

తేమ 12% కంటే ఎక్కువ ఉంటే రూ. 6,950: కలెక్టర్

image

మార్కెట్‌ యార్డులో కొనుగోళ్లు నిలిచిపోవడంతో పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ రాజర్షి షా చొరవ తీసుకున్నారు. సోమవారం ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, వ్యాపారస్తులతో కలిసి రెండు గంటలు సమీక్షించారు. తేమ శాతం 12% కంటే ఎక్కువ ఉన్నా, ప్రైవేటు వ్యాపారుల ద్వారా క్వింటాలుకు ₹6,950 చెల్లించేలా ఒప్పందం కుదిరిందని కలెక్టర్‌ తెలిపారు. దీంతో రైతులకు ఊరట లభించింది.

News October 27, 2025

సైబర్ మోసాలకు గురికావొద్దు: వరంగల్ పోలీస్

image

పోలీస్, సీబీఐ అధికారులుగా సైబర్ నేరగాళ్లు మోసం చేసి, ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని, తమ పిల్లలు క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నారని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి కాల్స్‌కు భయపడకుండా, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్‌ను సంప్రదించాలని పోలీసు శాఖ అప్రమత్తం చేస్తోంది.