News April 14, 2025
HYDలో సత్తాచాటిన వికారాబాద్ అమ్మాయి

పెద్దేముల్ మండలం మన్సాన్‌పల్లి గ్రామానికి చెందిన యువతి బాక్సింగ్‌లో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. 7వ యూత్ అండర్-19 పురుషుల, మహిళల బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు సికింద్రాబాద్ లాలాపేట్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ మున్సిపల్ స్టేడియంలో 11, 12వ తేదీల్లో జరిగాయి. మన వికారాబాద్ జిల్లా ఆడబిడ్డ నిఖిత పంచ్‌లకు గోల్డ్ మెడల్ సాధించడం విశేషం.
Similar News
News December 1, 2025
పెళ్లి చేసుకున్న సమంత!

స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో వీరిద్దరి వివాహం జరిగినట్లు వెల్లడించాయి. ఈ కపుల్‌కు పలువురు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. కాగా పెళ్లికి సంబంధించి ఈ జోడీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
News December 1, 2025
గుంటూరులో 2,56,904 మందికి రూ.111.34కోట్ల పంపిణీ

జిల్లాలో ప్రతి నెల 2,56,904 మందికి లబ్దిదారులకు రూ.111.34కోట్ల పంపిణీ జరుగుతోంది. వీరిలో వృద్ధాప్యపు పింఛన్‌లు 1,18,174, వితంతు 70,112, చేనేత 3,862, గీతకార్మికులు 443, మత్స్యకారులు 570, ఒంటరి మహిళలు 11,330, చర్మకారులు 876, హిజ్రాలు 67, HIV బాధితులు 2,614, కళాకారులు 77, డప్పు కళాకారులు 854, దివ్యాంగులు 24,835, వైద్య సంబంధిత 1667, సైనిక సంక్షేమం 28, అభయహస్తం 3,994, అమరావతి భూముల సంబంధిత 17,401మంది.
News December 1, 2025
యువతకు ‘గీత’ చెప్పిన కర్మ సిద్ధాంతం ఇదే!

నేటి యువతరం భగవద్గీత నుంచి కర్మ సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి. లక్ష్యంపై దృష్టి పెట్టి, ఫలితంపై ఆందోళన చెందకుండా తమ పనిని నిస్వార్థంగా చేయాలని గీత బోధిస్తుంది. మంచి జరిగినా, చెడు జరిగినా రెండింటినీ జీవితంలో భాగమే అనుకొని, ఏకాగ్రతతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలి. ఈ ఆత్మవిశ్వాసం, నిలకడ నేటి పోటీ ప్రపంచంలో విజయానికి కీలకం. SHARE IT


