News November 2, 2024
HYDలో సదర్ సయ్యాట.. నేడు ధూం.. ధాం..!

సదర్‌కు HYD ముస్తాబైంది. సా. 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నగర వీధుల్లో దున్నరాజుల భారీ ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ‘బహుబలి’ (హరియాణా) దున్నరాజు ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాత్రి నారాయణగూడ సెంటర్‌కు నగర నలువైపుల నుంచి యాదవ సోదరులు వేలాదిగా తరలివస్తారు. YMCAలో జరిగే ఈ వేడుకను హైదరాబాదీలు పెద్ద సదర్‌గా పిలుచుకుంటారు. అధికారికంగా సదర్ అని ప్రభుత్వం ప్రకటించడంతో అంచనాలు మరింత పెంచింది.
Similar News
News December 4, 2025
HYD: ఫ్యూచర్ సిటీకి సల్మాన్‌ఖాన్!

డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఆహ్వానించారు. ఈ సమ్మిట్‌లో మీడియా, వినోద రంగాల్లోని పెట్టుబడిదారులతో జరిగే సమావేశంలో సల్మాన్‌ఖాన్ ప్రసంగించే అవకాశం ఉంది. ఇటీవల ముంబై పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సల్మాన్‌ఖాన్‌ను కలిసిన విషయం తెలిసిందే.
News December 4, 2025
రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏసీబీ దాడులు

రంగారెడ్డి కలెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే, ల్యాండ్స్ రికార్డు ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏడీ సర్వేయర్ శ్రీనివాస్‌కు చెందిన గచ్చిబౌలిలోని మైత్రి హోమ్స్‌లోని ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో 3 బృందాలుగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.
News December 4, 2025
ఫ్యూచర్ సిటీ: ప్రభుత్వ ప్రాధాన్యతలివే!

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ఎగ్జిబిషన్ ఫ్లోర్ ప్లాన్ లీక్ అయింది. మ్యాప్ ప్రకారం, ఎగ్జిబిషన్ కేంద్ర బిందువు 5 మీటర్ల డోమ్ కాగా, అగ్రస్థానం భారత్ ఫ్యూచర్ సిటీకి దక్కింది. కీలకమైన డిఫెన్స్/స్పేస్ (1, 2) స్టాల్స్, MRDC పక్కన హాల్ పైభాగంలో ఉన్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు, రాబోయే పెట్టుబడులు ఏ రంగం వైపు మొగ్గు చూపుతున్నాయో ఈ లేఅవుట్ స్పష్టం చేస్తోంది. ఇది కేవలం ప్లాన్ కాదు, తెలంగాణ టార్గెట్!


