News November 2, 2024

HYDలో సదర్ సయ్యాట.. నేడు ధూం.. ధాం..!

image

సదర్‌కు HYD ముస్తాబైంది. సా. 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నగర వీధుల్లో దున్నరాజుల భారీ ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ‘బహుబలి’ (హరియాణా) దున్నరాజు ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాత్రి నారాయణగూడ సెంటర్‌‌కు నగర నలువైపుల నుంచి యాదవ సోదరులు వేలాదిగా తరలివస్తారు. YMCAలో జరిగే ఈ వేడుకను హైదరాబాదీలు పెద్ద సదర్‌‌గా పిలుచుకుంటారు. అధికారికంగా సదర్‌ అని ప్రభుత్వం ప్రకటించడంతో అంచనాలు మరింత పెంచింది.

Similar News

News December 7, 2025

రంగారెడ్డి జిల్లా నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్

image

చిల్కూర్‌లో SBI రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కింద యువతకి సీసీటీవీపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి రంగారెడ్డికి చెందిన 18- 45 ఏళ్లలోపు పురుషులు చిల్కూర్ SBI శిక్షణ కేంద్రంలో పేరును నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. డిసెంబర్ 9 నుంచి ఉచిత శిక్షణతో పాటు, ఉచితంగా హాస్టల్ వసతి, భోజన సౌకర్యం, యూనిఫామ్, టూల్ కిట్ ఇస్తారు. వివరాల కోసం 8500165190లో సంప్రదించగలరు.

News December 6, 2025

రంగారెడ్డి: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో శుక్రవారంతో ముగిసింది. చివరి విడతలో స్వీకరించిన నామినేషన్లను నేడు పరిశీలించనున్నారు. ఈనెల 9వ తేదీ వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. మూడో విడతలో 174 గ్రామపంచాయతీలకు, 1598 వార్డులకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు. కాగా, జిల్లావ్యాప్తంగా 526 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

News December 6, 2025

HYD: ఓఆర్ఆర్‌పై ప్రమాదాలు తగ్గించేందుకు ఏఐ టెక్నాలజీ

image

ఓఆర్ఆర్‌పై అతివేగం, రాంగ్‌సైడ్ పార్కింగ్, డ్రైవర్ల నిర్లక్ష్యం వంటి కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి నివారణకు సైబరాబాద్ పోలీసులు, హెచ్ జీసీసీలు సంయుక్తంగా కార్యాచరణ దిగి 24 గంటల పాటు ఔటర్‌పై నిఘా ఉంచేందుకు ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 14 ప్రాంతాల్లో మల్టీ వయలేషన్ డిటెక్షన్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.