News December 31, 2024

HYDలో సీరియల్ నటికి వేధింపులు.. కేసు నమోదు

image

సీరియల్ నటిని వేధించిన వ్యక్తిపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాలు.. AP వెస్ట్ గోదావరికి చెందిన మహిళ(29) కృష్ణానగర్‌లో నివాసం ఉంటోంది. ఇటీవల ఓ సీరియల్‌ షూట్‌లో ఫణితేజతో ఆమెకు పరిచయం ఏర్పడింది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో అతడు అసభ్యకరమైన వీడియోలు పంపాడు. ఇతరులతో దిగిన ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. వేధింపులు తాళలేక బాధితురాలు జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Similar News

News January 7, 2025

HYD: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

HYDలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. 2018లో వనస్థలిపురం PS పరిధిలో తాపీ మేస్త్రిగా పనిచేసే కార్తిక్(22) ఓ బాలికను ప్రేమపేరుతో మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. 

News January 7, 2025

HYD: భారీగా పట్టుబడ్డ నకిలీ పన్నీరు

image

హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిసరి ఎంక్లేవ్‌లో నకిలీ పన్నీరు భారీ మొత్తంలో పట్టుబడింది. విశ్వసనీయ సమాచారంతో నకిలీ పన్నీరు తయారు కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేపట్టారు. నిందితులను పట్టుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. అక్కడ సుమారు 600 కిలోల పన్నీరు, కొన్ని రకాల కెమికల్స్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బేగం బజార్‌కు చెందిన ఓ వ్యాపారి దీన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం.

News January 7, 2025

HYD: hMPV పాత వైరస్.. జాగ్రత్త మంచిది: మంత్రి రాజనర్సింహ

image

hMPV అనేది కొత్త వైరస్ కాదని, 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని, ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందన్నారు. చైనాలో ఈ సంవత్సరం hMPV కేసులు ఎక్కువయ్యాయన్నారు.