News February 1, 2025
HYDలో హృదయవిదారక ఘటన

HYDలోని వారాసిగూడ PSపరిధిలో <<15323241>>ఇంట్లో తల్లి మృతదేహంతో<<>> ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే బౌద్ధనగర్లోని ఓ ఇంట్లో నివాసముంటూ తల్లి ఇద్దరు కూతుర్లను చూసుకుంటోంది. తండ్రి ఆ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోగా.. గత కొద్దిరోజులుగా తల్లి లలిత అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో 9 రోజులుగా మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని ఉండిపోగా ప్రస్తుతం ఆ పిల్లలు తల్లిలేక అనాథలయ్యారు.
Similar News
News November 27, 2025
‘బాయిలోనే బల్లి పలికే’ సాంగ్పై కామెంట్స్.. SRనగర్లో ఫిర్యాదు

సింగర్ మంగ్లీ తన తాజా పాట ‘బాయిలోనే బల్లి పలికే’పై జనాదరణ పొందింది. అటువంటి పాట మీద ఓ వ్యక్తి అసభ్యకరంగా, కించపరిచే విధంగా కామెంట్స్ చేశాడంటూ SRనగర్ PSలో ఆమె ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తన పాటనే కాకుండా, జాతిని ఉద్దేశిస్తూ నీచంగా మాట్లాడారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఓ వర్గాన్ని కించపరిచిన ఆ వ్యక్తిని శిక్షించాలని పోలీసులను మరోవైపు కొందరు నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నాయి.
News November 27, 2025
NIT వరంగల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

<
News November 27, 2025
2 జిల్లాల్లో నియోజకవర్గం.. తొలిదశలోనే పోలింగ్..!

రెండు జిల్లాలలో విస్తరించి ఉన్న వేములవాడ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు తొలి విడతలో ఒకేసారి జరగనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 మండలాల్లో 85, జగిత్యాల జిల్లాలో 3 మండలాల్లో 44 పంచాయతీలు ఉండగా, నేటి నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, డిసెంబర్ 3న ఉపసంహరణ అనంతరం 11న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లోనూ ఒకే దశలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.


