News August 26, 2024
HYDలో హైడ్రా సరే.. మక్తల్ చెరువులు సంగతేంటి: MP

హైదరాబాద్లో హైడ్రా సరే కాని మక్తల్ నియోజకవర్గంలో కబ్జాలు చేసిన చెరువులు సంగతేంటని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సోమవారం మక్తల్ మండల కేంద్రంలో ఆమె మాట్లాడారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారని విమర్శించారు. హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్నారు. రుణమాఫీ లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News October 31, 2025
పరిశ్రమలకు గడువులోగా అనుమతులు ఇవ్వండి: కలెక్టర్ విజయేంద్ర

మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని కలెక్టర్ విజేంద్ర బోయి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. టీ బ్రైడ్ కింద షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఆరుగురికి వాహన పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపిందని కలెక్టర్ వెల్లడించారు.
News October 30, 2025
‘జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి’

రాష్ట్రంలో బీసీల జనాభా ప్రాతిపదికన వారికి కేటాయించాల్సిన 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని పాలమూరు విశ్వవిద్యాలయం బీసీ అధ్యాపకులు డిమాండ్ చేశారు. గురువారం రిజర్వేషన్ల అంశంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు సమక్షంలో చర్చా సమావేశం నిర్వహించారు. బీసీల రిజర్వేషన్లు న్యాయపరమైనవని, ప్రభుత్వం తక్షణమే స్పందించి అమలు చేయాలని కోరారు. విశ్రాంత చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.
News October 30, 2025
MBNR: ‘బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలి’

పాలమూరు విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో గురువారం జరిగిన బీసీల కార్యాచరణ సభకు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం తీసుకున్న బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


