News February 19, 2025

HYDలో 3 లక్షల మంది AI నిపుణులు: మంత్రి

image

ప్రపంచ నగరాలు టెక్నాలజీ అంటే HYD నగరం వైపే చూసేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర IT మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. HYDలో సమ్మిట్లో పాల్గొన్న మంత్రి, HYDలో 1500కు పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయని, వీటిలో 15 లక్షల మందికిపైగా పనిచేస్తున్నారని తెలిపారు. వీరిలో 3 లక్షల మంది AI నిపుణులు, లక్ష మంది చిప్ డిజైనర్లు ఉన్నట్లుగా తెలిపారు.

Similar News

News December 4, 2025

కండలేరుకు పెరుగుతున్న వరద నీరు

image

కండలేరు జలాశయం నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు 6,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 11 గంటలకు 28 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కండలేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో ప్రస్తుతం కండలేరులో నీటిమట్టం 60 టీఎంసీలకు చేరింది. నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

News December 4, 2025

అఖండ-2 ప్రీమియర్స్ రద్దు.. కారణమిదేనా?

image

వివాదాల కారణంగానే ‘అఖండ-2’ ప్రీమియర్లు <<18466572>>రద్దైనట్లు<<>> తెలుస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్‌కు 14 రీల్స్ సంస్థ రూ.28Cr చెల్లించాల్సిన వివాదం నేపథ్యంలో సినిమాను <<18465729>>ఆపాలని<<>> మద్రాసు HC ఆదేశించింది. అటు మూవీకి పనిచేసిన కొందరు టెక్నీషియన్లు కూడా తమకు వేతనాలు ఇవ్వలేదంటూ ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ కారణాలతోనే ప్రీమియర్స్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కానీ టెక్నికల్ గ్లిచ్ వల్లే ఆగిపోయినట్లు 14 రీల్స్ చెబుతోంది.

News December 4, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.1903, కనిష్ఠ ధర రూ.1750; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2052, కనిష్ఠ ధర రూ.2005; వరి ధాన్యం (BPT) ధర రూ.2100; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.3014, కనిష్ఠ ధర రూ.2651గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.