News March 28, 2025

HYDలో 50 మంది GOVT అధికారుల తొలగింపు..!

image

పదవీ విరమణ పొందినా చాలా మంది ఇంకా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్, రీ అపాయింట్‌మెంట్ పేరిట ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఇలాంటివారు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 50 మంది ఉన్నట్లు తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. దీంతో 50 మంది వరకు మార్చి 31న ఇంటిముఖం పట్టనున్నారు. అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఇంకా కిందిస్థాయి సిబ్బంది వీరిలో ఉన్నారు.

Similar News

News April 3, 2025

HYD: భారీ వర్షం.. ప్రజలకు జలమండలి ఎండీ సూచనలు

image

భారీ వర్షంతో అధికారులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అప్రమత్తం చేశారు. హాట్ స్పాట్లపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మ్యాన్ హోళ్ల మూతలు తెరవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో వ్యవహరించాలన్నారు.

News April 3, 2025

మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు

image

మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కలెక్టరేట్‌ను పేల్చేస్తామని, కలెక్టర్‌ను చంపేస్తామంటూ ఓ అగంతకుడు మెయిల్ పెట్టారు. ఈ విషయంపై విచారణ జరపాలని కలెక్టర్ గౌతమ్ డీసీపీ పద్మజ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే అంశంపై విచారణ చేస్తున్నారు. కాగా.. కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు నేపథ్యంలో ఉన్నతాధికారులు అత్యవసర సమావేశమయ్యారు.

News April 3, 2025

అత్తాపూర్‌లో 7 ఏళ్ల బాలుడి హత్య

image

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్డెన్ సిటీలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీని దుండగులు మీరాలం ట్యాంక్ సమీపంలో పడేశారు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హత్యకు గురైన బాలుడు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చుట్టు పక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. బాలుడి హత్య వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది.

error: Content is protected !!