News December 12, 2024

HYDలో 84,000 ఇందిరమ్మ ఇళ్లు!

image

HYDలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్‌న్యూస్. లబ్ధిదారుల వివరాలు పరిశీలించేందుకు ప్రభుత్వం సర్వేయర్లను నియమించింది. HYD‌లో 5,00,822, మేడ్చల్‌లో 3,22,064, రంగారెడ్డిలో 1,96,940, పటాన్‌చెరు నియోజవకర్గంలో 20,711, కంటోన్మెంట్‌లో 29,909 దరఖాస్తులు వచ్చాయి. తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్‌లో 84,000 ఇళ్లు నిర్మించాలి.

Similar News

News December 27, 2024

HYD: మంద జగన్నాథానికి మంత్రి పరామర్శ

image

నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథాన్ని HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా నిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ బీరప్ప, వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన చికిత్సను అందించాలని మంత్రి వైద్యులను కోరారు.

News December 27, 2024

HYD: వారం రోజులు సంతాప దినాలు: TPCC

image

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో వారం రోజులపాటు సంతాప దినాలుగా పాటించనున్నట్లు పేర్కొన్నారు. రేపటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలతో పాటు జనవరి 3 వరకు అన్ని రాజకీయ కార్యక్రమాలు రద్దు చేయనున్నట్లు తెలిపారు.

News December 27, 2024

HYD: స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం

image

ఎనిమిదో ఎడిషన్ తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఘనంగా ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు 6 విభాగాల్లో పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రతికూల వాతావరణంలోనూ హుస్సేన్‌సాగర్ జలాల్లో సెయిలర్లు రంగురంగుల బోట్లలో ప్రాక్టీస్‌తో సందడి చేశారు. ఈ ఏడాది హర్యానాకు చెందిన ఆరుగురు సెయిలర్లు ఓపెన్ విభాగంలో పాల్గొంటున్నారు.