News March 27, 2025
HYDలో 90% వాటర్ ట్యాంకర్లను బుక్ చేసేది వారే!

HYDలో వాటర్ ట్యాంకర్ల బుకింగ్ వివరాలను జలమండలి వెల్లడించింది. 13 లక్షల నీటి కనెక్షన్లలో కేవలం 42 వేల గృహాలే ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నాయని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. వీరిలో 500 మంది వినియోగదారులు 75 రోజుల్లో 31 వేల ట్యాంకర్లు బుక్ చేయగా.. 22 వేల మంది 90% ట్యాంకర్ సేవలను వినియోగిస్తూ 2.84 లక్షల ట్యాంకర్లు బుక్ చేస్తున్నారని వెల్లడించారు.
Similar News
News November 20, 2025
HYD: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పేట్ బషీరాబాద్లో నివాసం ఉండే కుమ్మరి ప్రణయ(29) భర్తతో గొడవల కారణంగా ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. రాత్రి ఇంట్లో గొడవల కారణంగా తీవ్ర మనస్తపానికి గురై తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఈరోజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News November 20, 2025
ASF: క్రీడారంగంలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి: కలెక్టర్

క్రీడారంగంలో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం ASF గిరిజన ఆదర్శ పాఠశాల మైదానంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడ పోటీలలో గెలుపొందిన విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. ప్రభుత్వం క్రీడా రంగాన్ని అభివృద్ధి చేస్తూ అనేక సౌకర్యాలు కల్పించి క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు.
News November 20, 2025
దిల్సుఖ్నగర్ మెట్రోస్టేషన్ వద్ద అసభ్యకరంగా హిజ్రాలు.. అరెస్ట్

HYD చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద రాత్రిళ్లు రోడ్లపై నిల్చొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ యువకులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఇద్దరు హిజ్రాలను సీఐ సైదులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.


