News August 6, 2024
HYDలో JOBS.. జీతం రూ.55 వేలు

HYDలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL)తోపాటు జోనల్ ఆఫీసుల్లో పనిచేసేందుకు పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది. ఐటీఐ, బీఈ/ బీటెక్ పాసై అనుభవం ఉండాలి. పోస్టును అనుసరించి 30-33 ఏళ్లు మించకూడదు. రూ.22,528-రూ.55,000 వరకు జీతం ఉంటుంది. AUG 8 దరఖాస్తు చివరి తేదీ. పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in/job_details_17_2024.php
Similar News
News November 2, 2025
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 46% పనులు పూర్తి: కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రూపుదిద్దుకుంటోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం రూ.714.73 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు 46 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ‘X’ వేదికగా వెల్లడించారు.
News November 2, 2025
HYD: అమ్మాయిలపై చేయి వేస్తూ అసభ్య ప్రవర్తన

బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదైన ఘటన HYDబంజారాహిల్స్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు..ఇందిరానగర్‌లో నివసించే ఇద్దరు అమ్మాయిలు బర్త్ డే వేడుకల అనంతరం తమ సోదరుడిని ఇంటికి పంపించి వస్తున్నారు. అదే వీధిలో ఉండే బాలు,నవీన్ వారిపై చేయి వేసి, అసభ్యకరంగా ప్రవర్తించగా బాలికలు వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా నిందితులను రిమాండ్‌కు తరలించారు.
News November 2, 2025
HYD: ఇక మొబైల్‌లోనే సులువుగా ఆధార్ అప్‌డేట్

ఆధార్ సేవలను యూఐడీఏఐ మరింత సులువు చేసిందని HYDలో అధికారులు తెలిపారు. ఇక నుంచి మొబైల్‌లోనే ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. చిరునామా అప్‌డేట్, డాక్యుమెంట్ల అప్‌లోడ్, మొబైల్ నంబర్ అప్‌డేట్ వంటివి మొబైల్‌లోనే చేసుకోవచ్చు. ఈ సేవలు పొందాలంటే యూఐడీఏఐ పోర్టల్ లేదా మై ఆధార్ యాప్ ద్వారా ఆన్‌లైన్ అప్‌డేట్ చేయవచ్చు. కానీ బయోమెట్రిక్, ఐరిస్ వంటి సేవల కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. SHARE IT


