News July 11, 2024

HYDలో JOBS.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ

image

HYDలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీకాం, బీబీఎం పాసై 28 ఏళ్ల వయసు మించని వారు అర్హులు. పోస్టును అనుసరించి రూ.21,500 నుంచి రూ.90,000 జీతం ఉంటుంది. జులై 11 దరఖాస్తుకు చివరి తేదీ. మరిన్ని వివరాలకు https://bel-india.in/job-notifications/ వెబ్‌సైట్‌ చూడండి. SHARE IT

Similar News

News October 29, 2025

HYDలో భారీ వర్షం.. ఈ మెసేజ్ వచ్చిందా?

image

HYD, RR, MDCL జిల్లాలో వర్ష తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని Telangana Integrated Command and Control Centre (TGiCCC) తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఫోన్లకు హెచ్చరిక మెసేజ్‌లు పంపింది. మీకూ వచ్చాయా?

News October 29, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి

image

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏర్పాట్లలో భాగంగా బుధవారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. జనరల్ అబ్జర్వర్ రంజిత్ కుమార్ అధ్యక్షతన పరిశీలన జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఈసీఐ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా ప్రక్రియ కొనసాగింది.

News October 29, 2025

జూబ్లిహిల్స్ బై పోల్స్.. ఎన్నికల నిర్వహణలో ఇవీ గణాంకాలు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నోటాతో కలిపి 59 మంది అభ్యర్థుల పేర్లను 407 పోలింగ్ బూత్‌లలో బ్యాలెట్ యూనిట్లలో (ప్రతి పోలింగ్ బూత్‌లో నాలుగు) అమర్చుతారు. 20 శాతం అదనంగా కలిపి 1954 బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తారు. ఇక 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాట్లు వాడనున్నారు. ఇవన్నీ ఇపుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డీఆర్సీలో ఉన్నాయి.