News July 11, 2024
HYDలో JOBS.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ

HYD భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీకాం, బీబీఎం పాసై 28 ఏళ్ల వయసు మించని వారు అర్హులు. పోస్టును అనుసరించి రూ.21,500 నుంచి రూ.90,000 జీతం ఉంటుంది. జులై 11 దరఖాస్తుకు చివరి తేదీ. మరిన్ని వివరాలకు https://bel-india.in/job-notifications/ వెబ్‌సైట్ చూడండి. SHARE IT
Similar News
News February 7, 2025
HYD: దారుణం.. మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం

మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. మేడ్చల్ పోలీసుల వివరాలు.. ఓ కేసు కోసం PSకు వచ్చిన మహిళ(31)తో PC సుధాకర్ పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఇంటికి పిలిచి పలుమార్లు అత్యాచారం చేశాడు. గర్భం దాల్చడంతో అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. చివరకు అతడి భార్య, స్నేహితుడితో కలిసి దాడి చేయించడంతో బాధితురాలు PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
News February 6, 2025
ఓయూ: వివిధ డిగ్రీ కోర్సుల పరీక్ష ఫీజు ఖరారు

OU పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల అన్ని విభాగాల BA, B Com, BSc, BBA కోర్సుల నాలుగు, ఆరు రెగ్యులర్ సెమిస్టర్, మొదటి, ఆరో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షా ఫీజులను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 వరకు ఎలాంటి లేట్‌ఫీ రుసుము లేకుండా కాలేజీలో చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను www.osmania.ac.inలో సందర్శించాలన్నారు.
News February 6, 2025
పెద్దఅంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

పెద్దఅంబర్‌పేట్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల ప్రకారం.. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో రిత్విక LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పసిపాప బస్సు కింద పడి నలిగిపోయిందని వారు వాపోయారు.