News February 20, 2025
HYDలో KCR సమావేశం.. కీలకనేతలు డుమ్మా

తెలంగాణ భవన్‌లో బుధవారం KCR అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ కీలక నేతలు రాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వదిన దశదినకర్మ నేపథ్యంలో హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాల సమాచారం. కాగా.. మిగతా ఎమ్మెల్యేలు గైర్హాజరుకు గల కారణాలు తెలియాల్సింది ఉంది.
Similar News
News November 27, 2025
కృష్ణా: సొంతిల్లు లేదా.. మూడు రోజులే గడువు త్వరపడండి.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇల్లులేని 22,694 కుటుంబాలకు (NTRలో 15,994, కృష్ణాలో 6,700) PM AWAS+ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రం ఇంటి నిర్మాణానికి రూ.1.59 లక్షలు ఇస్తోంది. మొత్తం రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు సాయం అందనుంది. అర్హత ఉన్న పేదలు తమ వివరాలను సచివాలయాల్లో నమోదు చేసుకోవడానికి NOV 30వ తేదీ చివరి గడువని అధికారులు స్పష్టం చేశారు.
News November 27, 2025
సిరిసిల్ల జిల్లాలో తొలి రోజు 42 సర్పంచ్ నామినేషన్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 42, వార్డు సభ్యుల స్థానాలకు 32 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలి రోజు గురువారం రుద్రంగి మండలంలో సర్పంచ్ 4, వార్డు 5, వేములవాడ అర్బన్ మండలంలో సర్పంచ్ 2, వేములవాడ రూరల్ మండలంలో సర్పంచ్ 7, వార్డు 4, కోనరావుపేట మండలంలో సర్పంచ్ 16, వార్డులకు 12, చందుర్తి మండలంలో సర్పంచ్ 13, వార్డు స్థానాలకు 11 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
News November 27, 2025
గద్వాల: నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలి: ఎస్పీ

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ టి.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులు, దర్యాప్తు నాణ్యతపై చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ సూచించారు.


