News February 20, 2025
HYDలో KCR సమావేశం.. కీలకనేతలు డుమ్మా

తెలంగాణ భవన్‌లో బుధవారం KCR అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ కీలక నేతలు రాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వదిన దశదినకర్మ నేపథ్యంలో హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాల సమాచారం. కాగా.. మిగతా ఎమ్మెల్యేలు గైర్హాజరుకు గల కారణాలు తెలియాల్సింది ఉంది.
Similar News
News March 17, 2025
పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షా తేదీ ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షా తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ వన్ టైం ఛాన్స్ బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈనెల 18వ తేదీ (రేపు) నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.
News March 17, 2025
NZB: ప్రజావాణికి 64 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌తో పాటు, ఆర్డీవో రాజేంద్రకుమార్‌కు అర్జీలు సమర్పించారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
News March 17, 2025
జగిత్యాల: ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం: ఎస్పీ

జగిత్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు లేఖలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.