News March 31, 2025
HYD:సర్వం సిద్ధం.. నేడే రంజాన్ పండుగ

HYD,ఉమ్మడి RR జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నెలవంక కనిపించడంతో నేడు ముస్లింలు రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) జరుపుకోనున్నారు. ఇప్పటికే ఈద్గాలు, మసీదుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పలు ఈద్గాల దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి,భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 30 రోజులుగా దీక్షలు చేస్తున్నా ముస్లింలు నెల వంక కనిపించటంతో ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ చాంద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Similar News
News November 4, 2025
మెట్పల్లి: మా కష్టం చూసి దేవుడూ కరగడా..?

ఆరుగాలం కష్టం.. అంతా వృథా. MTPL(M) మెట్లచిట్టాపూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పపక్కన నిలబడి, కన్నీరు పెట్టుకున్నఓ మహిళా రైతు ఆవేదన ఎవరికి చెప్పేది? మొన్న తుఫాను, నిన్న మొలకలు. 2 రోజులు ఎండ వచ్చిందని ఆరబెడితే, కుప్ప అడుగుభాగంలోనే ధాన్యం మొలకెత్తింది. ‘నష్టపోయిన మాపై దేవుడికి కూడా చిన్నచూపేనా?’ అంటూ గుండెలు బాదుకుంది. కష్టపడి పండించిన ధాన్యం ఇలా పాడవడం చూసి ఆ అన్నదాత కన్నీరు ఆపడం ఎవరి వశంకాలేదు.
News November 4, 2025
అమరచింతలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో అత్యధికంగా అమరచింతలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఘనపూర్ 6.2 గోపాల్ పేట్ 7.2 వనపర్తి 6.2 ఆత్మకూరు 13.6 వీపనగండ్ల 0.8 రేవల్లి 2.8 చిన్నంబాయిలలో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా సీపీఓ తన నివేదికలో పేర్కొన్నారు. జిల్లా ఒకరోజు వర్షపాతం మొత్తం 59.6 మిల్లీమీటర్లు కాగా సగటు 4.2 మిల్లీమీటర్లు నమోదయిందన్నారు.
News November 4, 2025
గచ్చిబౌలి: కో-లివింగ్‌లో RAIDS.. 12 మంది అరెస్ట్

గచ్చిబౌలి TNGOకాలనీలోని కో-లివింగ్ రూమ్స్‌లో పోలీసులు మెరుపుదాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న గుత్తా తేజతో పాటు మరో నైజీరియన్ హైదరాబాద్ యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రైడ్స్‌లో ఆరుగురు డ్రగ్ పెడ్లర్స్, ఆరుగురు కన్జ్యూమర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. MDMAతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


