News August 15, 2025
HYDకా షేర్‌ఖాన్.. మన తురుంఖాన్

స్వాత్రంత్ర్యం కోసం తిరుగుబాటు చేసిన తురుంఖాన్ అతడు. 1857లో చీదాఖాన్‌ను బంధి చేయడం సహించలేక తుర్రేబాజ్‌ఖాన్ బ్రిటిషర్లకు రెబల్ అయ్యాడు. సిపాయిల్లో తిరుగుబావుట ఎగరేసి 500 మందిని ఏకం చేశాడు. కోఠి బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసి, వీరోచిత పోరాటం చేశాడు. జీర్ణించుకోలేని తెల్లోళ్లు అజ్ఞాతంలో ఉన్న తుర్రేబాజ్‌ను చంపేసి, కోఠిలో నగ్నంగా వేలాడదీశారు. కోఠి తుర్రేబాజ్‌ఖాన్ స్మారకం ఇందుకు సజీవ సాక్ష్యం.
Similar News
News August 15, 2025
HYD: శ్రీకాంతా.. నీ అమరత్వం మరువం!

ఓ వైపు శరీరాన్ని మంటలు దహించివేస్తోన్న ఆ ఉద్యమకారుడి గొంతులో తెలంగాణ నినాదం ఆగలేదు. స్వరాష్ట్రం కోసం 2009 NOV 29న LBనగర్ చౌరస్తాలో శ్రీకాంతా చారి ఆత్మహుతితో ఉమ్మడి రాష్ట్రం ఉలిక్కిపడింది. గురిచేసింది. జనం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ‘జై తెలంగాణ’ అంటూ 5 రోజులు మృత్యువుతో పోరాడాడు. స్వరాష్ట్రం కోసం పరితపించి, ప్రాణాలు విడిచిన శ్రీకాంతాచారి జయంతి నేడు.
అమరుడా నీకు జోహర్లు.
News August 15, 2025
HYD: దశాబ్దాలుగా ఇబ్బందులే.. పట్టించుకోండి!

భారీ వర్షాల వల్ల మూసారాంబాగ్ బ్రిడ్జిపై వరద నీరు పారుతోంది. పోలీసులు ఈ వంతెనపై రాకపోకలను నిషేధించారు. అయితే, ఈ సమస్య దశాబ్దాలుగా ఉన్నప్పటికీ, దీనికి పరిష్కారం లభించలేదని వాహనదారులు వాపోతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు 2023లో 6 లేన్ల వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, 2024లో పనులు ప్రారంభించారు. ఏడాదిలోగా పూర్తవుతుందని చెప్పినా ఇంకా పూర్తి కాలేదు. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.
News August 15, 2025
రాజేంద్రనగర్: 18న డ్యూయల్ డిగ్రీ కోర్స్‌ల కౌన్సెలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యుయల్ డిగ్రీ ప్రవేశాల కోసం ఈ నెల 18న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. విశ్వవిద్యాలయం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.