News October 3, 2025
HYDకు క్యూ కట్టారు.. భారీగా ట్రాఫిక్ జామ్

దసరా పండుగ ముగియడంతో సొంతూరు వెళ్లిన జనం నగరానికి క్యూ కట్టారు. ఈ క్రమంలో HYD-విజయవాడ హైవే మీద భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. చిట్యాల టోల్‌గేట్ వద్ద కిలో మీటర్ మేర వాహనాల కదలిక మందగించింది. ORR నుంచి హయత్‌నగర్ మీదుగా ఎల్బీనగర్ రూట్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. బోడుప్పల్, ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ రూట్‌లోనూ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
Similar News
News October 4, 2025
HYD: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ విద్యతో పాటు క్రీడలు, విలువల ఆధారిత బోధన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెంచేలా విద్యావిధానం ఉంటుంది. మరిన్ని వివరాలకు 9059196161 ద్వారా లేదా yipschool.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
News October 4, 2025
HYD: బాలికను చంపి.. వాటర్ ట్యాంకులో పడేశారు.!

మాదన్నపేటలో ఏడేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో అల్లరి చేస్తుందనే కోపంతో మేనమామ, అత్త కలిసి బాలికను కిరాతకంగా చంపినట్లు తేలింది. చేతులు, కాళ్లు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి వాటర్ ట్యాంకులో పడేశారని పోలీసులు తెలిపారు. బాలిక తల్లితో కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
News October 3, 2025
అలయ్-బలయ్: ‘దత్తన్న దసరా దావత్’ అదిరింది!

అలయ్-బలయ్‌లో దత్తన్న దావత్ అదిరిపోయింది. 86 రకాల తెలంగాణ వంటకాలు 8 వేల మంది కడుపు నింపాయి. 12 క్వింటాళ్ల బాస్మతి, 4 క్వింటాళ్ల సోనా మసూరి రైస్, 12 క్వింటాళ్ల మటన్, 40 క్వింటాళ్ల చికెన్‌తో వెరైటీ డిష్‌లు గుమగుమలాడాయి. చేపలు, రొయ్యలు, లివర్, బోటి, తలకాయ, నల్లా, పాయ, హలీమ్‌తో పాటు 20 రకాల వెజ్ ఫ్రై ఐటమ్స్, పచ్చి పులుసు నుంచి సల్ల చారు వరకు మెనూలో ఉన్నాయి. హండిళ్లో చేసిన డబుల్ కా మీఠా నోరూరించింది.