News July 10, 2025

HYDకు వేల లీటర్ల కల్లు ఎలా వస్తోంది?

image

ఒక తాటి చెట్టు నుంచి గరిష్ఠంగా 4- 5 లీటర్ల కల్లు రావటమే గగనం. కానీ.. HYDలోని అనేక కల్లు కాంపౌండ్లలో రోజూ వేల లీటర్ల కల్లు విక్రయయిస్తున్నారు. ఇదంతా తయారు చేసిందే అని తాగేవారే చెబుతున్నారు. దానికి వారు ఎడిక్ట్ అయ్యి. ఒరిజిన్ కల్లు ఇచ్చినా తీసుకోరు. చాలా చోట్ల నిషేదిత కెమికల్స్, తియ్యదనానికి శాక్రిన్ కలుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క బీర్ సీసా (650)లో కల్లు రూ.50 ధరతో విక్రయిస్తున్నారు.

Similar News

News July 11, 2025

నాకు ప్రాణ హాని ఉంది: ట్రంప్

image

ట్రంప్‌పై ఏ క్షణమైనా దాడి జరగొచ్చని ఇరాన్ సీనియర్ అధికారి <<17014894>>జావద్ లారిజనీ<<>> చేసిన హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘జావద్ లారిజనీ హెచ్చరికలను బెదిరింపులుగానే భావిస్తున్నాను. నా ప్రాణాలకు హాని ఉంది అనే వార్తల్లో సందేహం లేదు. నిజానికి నేను ఏడేళ్ల వయసు నుంచే సన్ బాత్ చేయడం మానేశాను’ అని వ్యాఖ్యానించారు. ఆ సమాధానం చూస్తే ఇరాన్ హెచ్చరికలను ట్రంప్ తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.

News July 11, 2025

సిద్దిపేట: ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించాలి: కలెక్టర్

image

ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో కలిసి ఆయిల్ ఫెడ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో ఆయిల్ ఫామ్ తోటల పెంపకంపై సమీక్షా నిర్వహించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ జిల్లాలో సాగు పురోగతిని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.

News July 11, 2025

వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి: కలెక్టర్

image

సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, అన్ని చోట్లా ఫాగింగ్ చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ హరేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశామయ్యారు. అన్ని వ‌స‌తి గృహాల నిర్వ‌హ‌ణ‌పై ప్రత్యేక దృష్టి సారించాల‌ని, పారిశుద్ధ్య చ‌ర్య‌లు ప‌క్కాగా చేప‌ట్టాల‌ని సూచించారు. దోమ‌ల నివార‌ణ‌లో భాగంగా వీధులలో క్ర‌మం త‌ప్ప‌కుండా ఫాగింగ్ చేయాల‌ని చెప్పారు.