News January 14, 2026
HYDద్‌లో ‘ఫిన్లాండ్’ చదువుల జోరు

మన పిల్లలకు ఇక ఫిన్లాండ్ రేంజ్ చదువులు HYDలోనే దొరికేస్తాయోచ్! కొల్లూరులో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఫిన్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్కూల్‌ను ‘హారిజన్ ఎక్స్‌పీరియెన్షియల్ వరల్డ్ స్కూల్’ (HEWS) ప్రారంభించింది. ప్రపంచంలోనే నం.1 విద్యా విధానాన్ని మన దగ్గరకు తెస్తూ టీసీసీ క్లబ్‌లో వేడుక నిర్వహించారు. బట్టీ పద్ధతులకు స్వస్తి చెప్పి, పిల్లల్లో సృజనాత్మకత పెంచడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
Similar News
News March 12, 2026
HYD: బస్తీ గర్భిణులకు ‘ఏఐ’ భరోసా

హెచ్‌హెచ్‌ఎఫ్-విప్రో సహకారంతో అర్బన్ స్లమ్స్‌లో ‘ఆనందిమా’ కిట్ల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు షురూ అయ్యాయి. ఈ స్మార్ట్ ఏఐ కిట్‌తో బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి పరీక్షలతో పాటు కడుపులోని బిడ్డ గుండె చప్పుడును కూడా నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఏవైనా తేడాలుంటే AI వెంటనే హెచ్చరిస్తుంది. ‘కేర్ మదర్’ యాప్ ద్వారా హైరిస్క్ కేసులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ తల్లీబిడ్డల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు.
News March 11, 2026
జీహెచ్‌ఎంసీ చట్టానికి మంగళం.. HYDలో కొత్త చట్టం!

GHMCని మూడు కార్పొరేషన్లుగా విభజించడమే కాకుండా, పాత ‘GHMC యాక్ట్-1955’ స్థానంలో కొత్తగా Core Urban Act తీసుకురావడానికి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే భవన నిర్మాణాల నుంచి రోడ్ల నిర్వహణ వరకు అంతా కేంద్రీకృత పద్ధతిలో సాగుతుంది. స్థానిక కార్పొరేషన్ల అధికారాలను కుదించి, నేరుగా రాష్ట్ర ప్రభుత్వం (MAUD శాఖ) చేతుల్లోకి పాలనను తెచ్చుకోవడమేనని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.
News March 11, 2026
రూ.126 కోట్ల ‘గ్రీన్’ టెండర్లు.. పచ్చదనం ముసుగులో నిధుల దోపిడీయేనా?

HMDA గ్రీన్ ప్లాన్‌లో మతలబు ఏంటి? పదేళ్ల పాటు మొక్కల సంరక్షణ పేరుతో రూ. 126 కోట్లు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉన్న ప్లాంటేషన్ పరిస్థితి దారుణంగా ఉంటే, కొత్తగా ఇన్ని కోట్లు కుమ్మరించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. చట్టబద్ధంగా టెండర్లు పిలిచామని అధికారులు చెబుతున్నా, కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది.


